Site icon NTV Telugu

Kadapa: వినాయకుడి విగ్రహంపై రప్పా.. రప్పా..!

Rappa Dialogue Ganesh Idol

Rappa Dialogue Ganesh Idol

Kadapa: పండుగలు పార్టీలకు అతీతంగా.. భక్తితో జరిగినప్పుడే బాగుంటుంది.. అయితే, వినాయకుడి విగ్రహంపై కూడా సినిమా డైలాగ్‌లు.. పొలిటికల్‌ కామెంట్స్‌ రాసి.. ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తే.. చూసేవాళ్లకే వెగటపుట్టే విధంగా ఉంటుంది.. వినాయకుడి విగ్రహం వెనక భాగంలో రప్పా.. రప్పా.. డైలాగ్‌ తప్పలేదు.. విగ్రహం వెనుకభాగాన రప్పా.. రప్పా నినాదాలు, గొడ్డలి గుర్తు వేశారు తెలియని వ్యక్తులు.. వైసీపీ రప్పా రప్పా నినాదాలు.. గొడ్డలి గుర్తులూ వినాయక విగ్రహన్ని కూడా వదల్లేదు.

Read Also: Kasu Mahesh Reddy: కర్రలతో కాదు.. గొడ్డలితో తిరిగి వస్తారు.. వైసీపీ నేత హాట్‌ కామెంట్స్..

ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో జరగాల్సిన వినాయకుడి నిమజ్జన శోభాయాత్రలో వికృత చేష్టలు పరాకాష్టకు చేరాయి. వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని పెద్దనపాడు గ్రామంలో వినాయకుని నిమజ్జనంలో వింత పోకడలు చోటుచేసుకున్నాయి. గ్రామంలోని వీధుల్లో నిమజ్జనానికి బయలుదేరిన వినాయక విగ్రహం వెనుక వైపున 2.0, రప్పా రప్పా వైఎస్సార్ అక్షరాలతో పాటు ఎర్రటి రంగులో ఉన్న గొడ్డలి గుర్తును వేశారు. ఇంతటితో ఆగకుండా వినాయక విగ్రహాన్ని పైకి ఎగురవేస్తూ రప్పా, రప్పా వైఎస్సార్ అని కేకలు వేస్తూ నిమజ్జనానికి వీధుల గుండా తీసుకెళ్లడం గ్రామస్థులను విస్మయానికి గురిచేసింది. ఆదివారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే సంవత్సరం వినాయక చవితికి ఎవరికీ చందాలివ్వకూడదని గ్రామానికి చెందిన కొందరు చెబుతున్నారు.. కాగా.. పెద్దనపాడు వినాయక విగ్రహ నిమజ్జన విషయంలో ఎలాంటి ఫిర్యాదులు రాలేదని, శాంతి భద్రతల దృష్ట్యా ఈ సంఘటనపై విచారణ చేస్తున్నామని సీఐ విశ్వనాథరెడ్డి తెలిపారు.

Read Also: Visakhapatnam : డ్రగ్స్ వినియోగంలో ఏపీలో వేగంగా విస్తరిస్తున్న విశాఖ.. ఆందోళనలో అధికారులు

అయితే, ఆ వీడియోను షేర్‌ చేసి.. టీడీపీ నేతలు ఫైర్‌ అవుతున్నారు.. “ఏమిటీ ఉన్మాద చేష్టలు ?.. రామతీర్ధంలో రాముల వారి తల నరికించినట్టు, మీ బూతులు నాని నరికింది హనుమంతుడి చేయే కదా అన్నట్టు, ఇప్పుడు నీ పిల్ల సైకోల చేత, వినాయకుడుని నిమజ్జనం చేయకుండా రప్పా రప్పా గొడ్డలి వేటు వేస్తావా ఏంటి ?.. బాబాయ్ ని ఎలాగూ వదల్లేదు, కనీసం దేవుళ్ళని అయినా వదిలేయి జగన్..” అంటూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం ట్వీట్‌ చేసింది..

Exit mobile version