Site icon NTV Telugu

ZPTC By Elections: కడప జిల్లా జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ట్విస్టుల మీద ట్విస్టులు..!

Zptc By Elections

Zptc By Elections

ZPTC By Elections: కడప జిల్లాలోని జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ట్విస్టులు మీద ట్విస్టులు వచ్చి చేరుతున్నాయి… పోలింగ్ అడుగు దగ్గర పడుతూ ఉండటంతో అన్ని పార్టీలు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు పై దృష్టి సారించాయి.. దీంతో ఆ పార్టీలకు నిప్పులాంటి నిజాలు వెలుగు చూస్తున్నాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారులు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు.. దీంతో దాదాపు నాలుగు వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే పరిస్థితి ఇక్కడ నెలకొంది.. ఈ అంశంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది.. ఇంతకీ పోలింగ్ కేంద్రాల మార్పు ఏంటి ? ఎందుకు చేయాల్సి వచ్చింది? అని అంటూ వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు..

Read Also: Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

జడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.. గత 25 సంవత్సరాలుగా ఎన్నడూ లేని సంస్కృతికి అధికారులు తెరలేరు.. దాదాపు ఆరు పోలింగ్ కేంద్రాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్పు చేయడంతో రాజకీయ దుమారం చెలరేగింది.. అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గి అధికారులు పోలింగ్ కేంద్రాలను మార్చారని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది వైసీపీ.. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో 10,601 ఓట్లు ఉన్నాయి.. 4000 ఓట్లు ఉన్న ఆరు పోలింగ్ కేంద్రాలను ఆ ప్రాంతాలలో కాకుండా మరో ప్రాంతానికి మార్చడమే ఇక్కడ సమస్యగా మారింది… పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో మొత్తం 15 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి… వీటిలో 6, 7, 8 ,9 ,10 ,11 పోలింగ్ కేంద్రాలను వేరే ప్రాంతాలకు మార్చారు అధికారులు… ఇంటి ప్రక్కనే పోలింగ్ కేంద్రం ఉన్న ఆ ఓటర్ మాత్రం తన ఓటును నాలుగు కిలోమీటర్ల వెళ్లి వేసుకోవాల్సిన దుస్థితి ఇక్కడ నెలకొంది.. ఇదే ఇప్పుడు వైసీపీకి చిర్రెత్తేలా చేసిందట.. ఓటమి భయంతో టీడీపీ అధికారులపై ఒత్తిడి తెచ్చిందని ఆరోపిస్తోంది.. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు రాకుండా చేయడం వల్ల పోలింగ్ బూత్‌లను ఆక్రమించుకొని సైక్లింగ్ లేదా రిగ్గింగ్ చేసుకోవాలని టీడీపీ భావిస్తున్నట్లు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు.

Read Also: Turaka Kishore: ఎట్టకేలకు జైలు నుంచి విడుదలైన తురకా కిషోర్‌..

గత 25 సంవత్సరాలుగా పులివెందుల నియోజకవర్గంలో ఉన్న పోలింగ్ కేంద్రాలను మార్చడం వల్ల దాదాపు నాలుగు వేల మంది ఓటర్లు ఫ్రీగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీలు లేకుండా పోయింది.. ఎర్రబెల్లి ఎంపీపీ స్కూల్‌లో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని నల్లపురెడ్డిపల్లి జడ్పీ హైస్కూల్ కు మార్చారు. ఎర్రబెల్లి ఎలిమెంటరీ స్కూల్ లో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని, నల్లపురెడ్డిపల్లి జడ్పీ హైస్కూల్ కు మార్చారు. నల్లగొండ వారి పల్లిలోని ఎలిమెంటరీ స్కూల్ లో ఉన్న పోలింగ్ బూతును, నల్లపురెడ్డిపల్లి జడ్పీ హైస్కూల్ కు మార్చారు. నల్లపురెడ్డిపల్లి జడ్పీ హైస్కూల్లో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని ఎర్రబెల్లి ఎలిమెంటరీ స్కూల్ కు మార్చారు. నల్లపురెడ్డిపల్లి జడ్పీ హైస్కూల్లో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని ఎర్రబెల్లి ఎలిమెంటరీ స్కూల్ కు మార్చారు. నల్లపురెడ్డిపల్లి జడ్పీ హైస్కూల్లో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని నల్లపురెడ్డిపల్లి ఎలిమెంటరీ స్కూల్ కు మార్చారు. దీంతో ఒక ప్రాంతంలోని వ్యక్తులు మరో ప్రాంతానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.. పోలింగ్ కేంద్రాల మార్పుపై వైసీపీ తీవ్రంగా పరిగణించింది. ఈ అంశాన్ని ఎన్నికల కమిషన్ కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది.

Read Also: Guvvala Balaraju : ఎల్లుండి బీజేపీలో చేరుతున్న.. నల్లమల్ల ప్రాంతంలో బీజేపీ జెండా ఎగురవేస్తా..

పోలింగ్ కేంద్రాల మార్పుతో ప్రభుత్వం పుట్ట పాల్పడుతోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు ఒక పోలింగ్ పరిధిలోకి వచ్చే ఓటర్లను మరో పోలింగ్ బూత్ కు మార్చడం ఏంటి అని ఆయన ప్రశ్నించారు.. ఇటీవల నల్ల గొండువారి పల్లెలో వైసీపీ నేతలపై హత్యాయత్నం జరిగిందని ఇటువంటి పరిస్థితులలో ఓటర్లు ఒక ఊరు నుంచి మరొక ఊరికి వెళ్లి ఓటు హక్కును ఎలా వినియోగించుకుంటారని ఆయన ప్రశ్నించారు.. ఓటర్లకు భద్రత ఎవరు కల్పిస్తారని ఆయన ప్రశ్నించారు.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ కార్యకర్తలపై దాడులు, కేసులు, దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉన్న సమయంలో , ఓటర్లను బదిలీ చేయడం మరో దుర్మార్గమైన చర్య అని ఆయన ఆరోపించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరమన్నారు. అంతేకాకుండా కోర్టు దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకు వెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు.. జడ్పీటీసీ ఎన్నికలలో పోలింగ్ కేంద్రాల మార్పు రాజకీయ దుమారం రేపుతుంది. మరి అధికారులు ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపడతారో వేచి చూడాల్సిందే.

Exit mobile version