Site icon NTV Telugu

NTR Fan Died in Devara movie Theatre: ‘దేవర’ థియేటర్‌లో విషాదం.. కేకలు వేస్తూ కుప్పకూలి అభిమాని మృతి

Kadapa

Kadapa

NTR Fan Died in Devara movie Theatre: యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ హీరో హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దేవర.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.. అర్ధరాత్రి నుంచి బెన్‌ఫిట్‌ షోల్లో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ హంగామా చేస్తున్నారు.. అయితే, ఆ ఆనందమే ఓ ఎన్టీఆర్‌ అభిమాని ప్రాణాల మీదకు తెచ్చింది.. కడపలో సినిమా చేస్తూ ఎన్టీఆర్ అభిమాని ప్రాణాలు విడిచాడు.. దేవర చిత్రం విడుదల సందర్భంగా కడపలోని అప్సర థియేటర్‌లో అభిమానుల కోసం ఫ్యాన్స్ షో వేశారు.. ఇక, సినిమా చూస్తున్న క్రమంలో అభిమానులు రెచ్చిపోయారు.. ఎన్టీఆర్‌ ఎంట్రీ.. ఫైట్స్‌, డైలాగ్స్‌.. ఇలా ప్రతీ సీన్‌కి అరుపులు, కేకలతో హోరెత్తించారు.. అయితే, కేకలు వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు ఓ అభిమాని.. వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.. కానీ, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు.. మృతుడు సీకే దీన్నే మండలం జమాల్‌పల్లికి చెందిన మస్తాన్ వలీగా గుర్తించారు పోలీసులు. మస్తాన్‌ వలీ.. ఎన్టీఆర్‌కి పెద్ద ఫ్యాన్‌ అనీ.. కానీ, సినిమా చూస్తూ ఇలా ప్రాణాలు విడుస్తాడని అనుకోలేదంటూ కన్నీరు పెడుతున్నారు స్నేహితులు..

Read Also: MLA Pulivarthi Nani: వైఎస్‌ జగన్‌ తిరుమల పర్యటన.. ఎమ్మెల్యే పులివర్తి నాని హాట్‌ కామెంట్స్‌

Exit mobile version