Gandikota Murder Case: కడప జిల్లాలోని గండికోటలో జరిగిన మైనర్ బాలిక దారుణ హత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. బాలిక హత్యకు ప్రీ ప్లాన్ గా స్కెచ్ వేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రియుడు, కుటుంబ సభ్యులు కాకుండా బాలిక హత్య కేసులో కొత్త వ్యక్తుల ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. బాలికను హత్య చేయడానికి గత మూడు నెలలుగా రెక్కీ? చేసినట్లు సమాచారం. గతంలో పలుమార్లు బాలిక తన ప్రియుడుతో కలిసి గండికోటకు వెళ్లినట్లు తెలుస్తుంది.. పక్కా సమాచారంతోనే బాలిక, ఆమె ప్రియుడిని హత్య చేయడానికి స్కెచ్ వేసినట్లు టాక్.
Read Also: ENG vs IND: అర్ష్‌దీప్ సింగ్ ఔట్.. టీమిండియాలోకి సీఎస్‌కే నయా బౌలర్ ఎంట్రీ!
అయితే, మైనర్ బాలిక హత్యకు మూడు రోజుల ముందు ప్రియుడితో ఇంస్టాగ్రామ్ లో చాటింగ్ చేసినట్లు సమాచారం. ఎక్కడ? ఎప్పుడు? ఎలా? కలవాలి అనే దానిపై చాటింగ్ జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ చాటింగ్ ను కుటుంబ సభ్యులు పసిగట్టారా?.. పక్కా సమాచారంతోనే ఈ హత్య జరిగిందా అన్న కోణంలో సమగ్రంగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
