MLA Madhavi Reddy: కడపలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కుర్చీ పంచాయితీ చోటు చేసుకుంది.. గతంలో, కడప మున్సిపల్ సమావేశాల్లో కుర్చీ కోసం గొడవకు దిగిన ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి రెడ్డి.. ఇప్పుడు.. ఇండిపెండెంట్ వేడుకల్లోనూ కుర్చీ విషయంలో అధికారులపై కస్సుబుస్సులాడారు.. కడప ఇండిపెండెన్స్ డే వేడుకల్లో వేదికపై సముచిత స్థానం కల్పించ లేదని కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి రెడ్డి ఫైర్ అయ్యారు.. వేడుకలు జరుగుతున్న వేదిక దగ్గరే నిల్చుని ఉండిపోయారు ఎమ్మెల్యే మాధవి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి. తనకు వేదికపై కుర్చీ వేయలేదంటూ జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.. పోలీసు అధికారులు, చివరకు జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేసిన కుర్చీలో కూర్చోకుండానే.. వెనుదిరిగి వెళ్లిపోయారు ఎమ్మెల్యే మాధవి రెడ్డి..
Read Also: Venky77 : వెంకీ మామ – త్రివిక్రమ్.. పూజ కార్యక్రమలతో మొదలెట్టేసారు
అయితే, ప్రోటోకాల్ ప్రకారం వేదికపై మంత్రి, అధికారులకే చోటు కల్పించారు. కానీ, స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి పక్కన తనకు కుర్చీ వేయలేదని అలిగారు ఎమ్మెల్యే మాధవి రెడ్డి.. దీంతో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కడప ఎమ్మెల్యే తీరు వివాదాస్పదంగా మారింది.. కడప పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా జేసీ అతిధి సింగ్ పై ఎమ్మెల్యే మాధవి రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.. జేసీని గుడ్లు ఉరిమి చూశారు.. తనను స్టేజ్ పైకి ఆహ్వానించక పోవడంపై ఫైర్ అయ్యారు.. అయితే, స్టేజ్ పైకి రావాలని ఎమ్మెల్యేని కోరారు జిల్లా కలెక్టర్.. ఆమె తిరస్కరించడంతో.. అక్కడికి వెళ్లి కూర్చోమని కలెక్టర్ చెప్పారు. కానీ, దాదాపు అరగంటకు పైగా నిల్చొనే ఉన్న మాధవి రెడ్డి.. ఆ తర్వాత వెనుదిరిగి వెళ్లిపోయారు.. ఈ కార్యక్రమంలో స్టేజీపై ముఖ్య అతిధి మంత్రి ఫరూక్, కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీ అశోక్ కుమార్, జేసీ అతిధి సింగ్ మాత్రమే ఉండగా.. ఎమ్మెల్యేకు కుర్చీ వేయకపోవడమే.. తాజా వివాదానికి కారణమైంది.
