Site icon NTV Telugu

Minister Ramprasad Reddy: స్టేడియాలను ఆధునీకరిస్తాం.. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తాం..

Minister Ramprasad Reddy

Minister Ramprasad Reddy

Minister Ramprasad Reddy: రాష్ట్రంలోని స్టేడియాలను ఆధునీకరిస్తాం.. గ్రామీణ పేద క్రీడాకారులను ప్రోత్సహిస్తాం అన్నారు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి.. కడప జిల్లా పులివెందులలో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోయినా హాకీ ఆంధ్రప్రదేశ్ పోటీ నిర్వహించడం సంతోషించదగ్గ విషయం అన్నారు. ప్రభుత్వంపై ఆధారపడకుండా ఈ పోటీలను నిర్వహిస్తున్న హాకీ ఆంధ్రప్రదేశ్ అధికారులను అభినందించారు.. ఇక, రాష్ట్రంలో ఉన్న స్టేడియాలను ఆధునికరిస్తాం.. మంచి శిక్షణ ఇచ్చేలా తీర్చిదిద్దుతాం అని ప్రకటించారు. గత ప్రభుత్వంలో క్రీడా శాఖ ఒకటి ఉంది అన్నది కూడా ప్రజలు మర్చిపోయారని ఎద్దేవా చేసిన ఆయన.. ఐదేళ్ల చివరి పాలన కాలంలో ఆడుదాం ఆంధ్ర అంటూ ఒక ఈవెంట్ మాత్రమే నిర్వహించారు.. ఆడుదాం ఆంధ్రకు 130 కోట్ల రూపాయలు ఖర్చు చేసి క్రీడాకారుల కడుపు కొట్టారని విమర్శించారు.. క్రీడాకారుల జీవితాన్ని వాళ్ల చేతుల్లోకి తీసుకొని 130 కోట్లు ఖర్చు చేశారు.. క్రీడాకారుల కోసం కాకుండా కేవలం వైసీపీ నాయకుల ప్రచారం కోసం వాడుకున్నారని మండిపడ్డారు.. క్రీడాకారుల సొమ్ము వాడుకున్న వారి నుంచి కక్కిచ్చేందుకు ప్రత్యేకంగా కమిటీ వేస్తున్నామని పేర్కొన్నారు. ఇక, కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులతో పేద గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తాం… పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామాల ద్వారా శాప్ ద్వారా క్రీడా పోటీల నిర్వహిస్తామని వెల్లడించారు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి.

Read Also: Nag Ashwin Love: ప్రియాంక దత్ – నాగ్ అశ్విన్ లవ్ స్టోరీ తెలుసా?

Exit mobile version