Site icon NTV Telugu

Minister Anam Ramanarayana Reddy: గోవులు మృతి అంటూ గ్లోబల్‌ ప్రచారం..! భూమనపై మంత్రి ఆనం ఫైర్‌

Anam Ramanarayana Reddy

Anam Ramanarayana Reddy

Minister Anam Ramanarayana Reddy: టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే ఎస్వీ గోశాలలో గోవులు మృతిచెందాయంటూ టీటీడీ మాజీ చైర్మన్‌, వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఫైర్‌ అయ్యారు దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.. కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తిరుమలలో అన్ని పూజా కార్యక్రమాలు సక్రమంగా జరుగుతున్నాయి… ఆగమ శాస్త్రము ప్రకారం అన్ని పూజా కార్యక్రమాలు చేపడుతున్నాం.. టీటీడీ గోశాలలో కొన్ని ఆవులు చనిపోయాయి అని చేస్తున్న ప్రచారం గ్లోబల్ ప్రచారం మాత్రమేనని స్పష్టం చేశారు.. గోవుల విలువ తెలియని వ్యక్తులు ఈ ప్రచారం చేస్తున్నారన్న ఆయన.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోవును తల్లిగా భావిస్తారు… తల్లి లాంటి గోవుల పరిస్థితిని సీఎం, డిప్యూటీ సీఎం ప్రతిరోజు పరిశీలిస్తున్నారు.. టీటీడీ గోశాలలో 230 మంది పరిచారకులు పనిచేస్తున్నారు… గోశాలలో అన్ని వసతులు ఉన్నాయని తెలిపారు.

Read Also: MS Dhoni: ఎంఎస్‌ ధోనీ అరుదైన రికార్డు.. ఐపీఎల్ హిస్టరీలోనే మొదటి ఆటగాడు!

గోవులు వయసు పైబడి, అనారోగ్యంతో చనిపోయే ఘటనలను భూతద్దంలో చూపిస్తున్నారన్నారు మంత్రి ఆనం.. టీటీడీని, ప్రభుత్వాన్ని విమర్శించడమే వారు పనిగా పెట్టుకున్నారని.. ఇది వారి అజ్ఞానానికే నిదర్శనం.. తల్లి గురించి మాట్లాడుతున్నారు మీరు.. మీకు మీ నాయకుడికి తల్లి గురించి తెలుసా? ఈ కొడుకుకు నేను ఎందుకు తల్లిగా ఉన్నానని బాధపడిన పరిస్థితి ఉంది కదా? అని ప్రశ్నించారు. అమ్మ అన్న పదానికి అర్థం తెలియని వ్యక్తి మీ నాయకుడు… టీటీడీలో ఎంత అవినీతిని మూట కట్టకున్నారో మీకు తెలుసా…? అని నిలదీశారు.. సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి నీ కుటుంబంలో నువ్వు అమలు చేస్తున్నావా..? అంటూ భూమన కరుణాకర్‌ రెడ్డిపై విరుచుకు పడ్డారు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి..

Exit mobile version