Site icon NTV Telugu

Gold Medal Prisoner: జైల్లో స్టూడెంట్‌ నెం.1.. గోల్డ్‌ మెడల్‌ కొట్టిన జీవిత ఖైదీ..

Gold Medal Prisoner

Gold Medal Prisoner

Gold Medal Prisoner: కొన్ని సినిమాల్లో చూస్తుంటాం.. బాల్యం నుంచి జైలు జీవితం గడిపిన హీరో.. అక్కడే నుంచి పరీక్షలు రాసి మంచి మార్కులు సాధిస్తాడు.. ఇంకా కొందరు హీరోలు అయితే.. ఆ సినిమాల్లో జైలు అధికారుల అనుమతితో కాలేజీకి సైతం వెళ్లి చదువుకుంటారు.. అయితే, ఇప్పుడు కడప జైలులో ఓ స్టూడెంట్‌ నంబర్‌ వన్‌ ఉన్నాడు.. ఇప్పుడు ఏకంగా గోల్డ్‌ మెడల్‌ కొట్టేశాడు.. హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న జీవిత ఖైదికి గోల్డ్ మెడల్ వరించింది.. జైలు జీవితాన్ని గడుపుతూనే దూరవిద్య ద్వారా నాలుగు డిగ్రీలు సాధించాడు ఆ యువకుడు… అంతేకాకుండా మూడు ఎంఏలు పూర్తి చేశాడు… తాజాగా, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్‌కు ఎంపికయ్యాడు యుగంధర్ అనే ఖైదీ.. పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ సబ్జెక్టులుగా బీఏ పూర్తి చేశాడు. ఇందులో 8.02 జీపీఎస్ సాధించి గోల్డ్ మెడల్ కు ఎంపికయ్యారు…

Read Also: Jogi Ramesh: బాలయ్య వ్యాఖ్యలపై జోగి రమేష్ కౌంటర్‌ ఎటాక్..

ఈనెల 30వ తేదీన హైదరాబాద్‌లో జరిగే యూనివర్సిటీ 26వ నేతకోత్సవంలో గోల్డ్ మెడల్ అందుకోవాలని యూనివర్సిటీ నుంచి యుగంధర్ కు ఆహ్వానం అందింది.. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం జంగాలపల్లికి చెందిన యుగంధర్ కు ఓ హత్య కేసులో 2011లో జీవిత ఖైదు శిక్ష పడింది. ఆయన కడప కేంద్ర కరాగారంలో శిక్ష అనుభవిస్తున్నాడు. కాగా దాదాపు 15 సంవత్సరాలుగా శిక్ష అనుభవిస్తున్న తన కుమారుడు యుగంధర్ కు క్షమాభిక్ష పెట్టాలని అతని తల్లి చంగమ్మ .. ప్రభుత్వానికి, అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు..

Exit mobile version