NTV Telugu Site icon

Kadapa MLA vs Mayor: కడపలో తారస్థాయికి చెత్త వివాదం.. మేయర్‌ వర్సెస్‌ ఎమ్మెల్యే..! ఉద్రిక్తత

Kadapa

Kadapa

Kadapa MLA vs Mayor: కడపలో చెత్త వివాదం తారస్థాయికి చేరుకుంది.. గత రెండు రోజులుగా కడప ఎమ్మెల్యే మాధవి, కడప మేయర్ సురేష్ బాబుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం.. నేడు ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. తమ వీధులలో చెత్త ఎత్తలేదు అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు చెత్తను తీసుకుని వచ్చి మేయర్‌ ఇంటి వద్ద వేసి నిరసనకు దిగారు. దీనికి ప్రతీకారంగా వైసీపీ నేతలు చెత్తను ప్రథమ పౌరుని ఇంటి వద్ద ఎలా వేస్తారు..? అంటూ వాదనకు దిగడంతో ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల రంగ ప్రవేశంతో ఇరు వర్గాలను చదరగొట్టారు.

Read Also: Sri Lankan Navy: 8 మంది తమిళనాడు జాలర్లను అరెస్ట్ చేసిన శ్రీలంక నేవీ

ఇక, కడప మేయర్ సురేష్ బాబు ఇంటి వద్ద టీడీపీ నేతల వైఖరికి నిరసనగా ఆందోళన చేపట్టారు వైసీపీ కార్యకర్తలు… మేయర్ ఇంటి వద్ద చెత్త వేసిన టీడీపీ నేతలను అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు.. కడప ఎమ్మెల్యే మాధవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. అప్పుడే ఇంటికి చేరుకున్నారు మేయర్ సురేష్ బాబు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చి మూడు నెలలు కాలేదు, అప్పుడే రాష్ట్రంలో అరాచక పాలన మొదలైందన్నారు.. టీడీపీ నేతలు ఇంటి వద్దకు వచ్చి ఇంత అరాచకం చేస్తున్న పోలీసులు ఏం చేస్తున్నారు..? అని మండిపడ్డారు.. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ క్లాప్స్ ప్రోగ్రాంని ఎత్తివేశారు.. 570 మంది సిబ్బందితో నిత్యం చెత్త ఏరి వేస్తున్నాం అని వెల్లడించారు.. తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం పందికొక్కులు మాత్రమే నా ఇంటి వద్ద చెత్తవేశాయి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రశాంతంగా ఉన్న కడపను టిడిపి అధికారంలోకి రాగానే అల్లర్లు సృష్టిస్తున్నారు.. నా ఇల్లు పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో ఉంది.. పోలీసులకు తెలియకుండా నా ఇంటి వద్ద చెత్త వేశారా? అని నిలదీశారు.. అంతేకాదు.. మేం అనుకుంటే మీ ఇల్లు వద్ద కూకటి వేళ్లతో తొలగించగలం… కానీ, మా నాయకుని ఆదేశాల మేరకే మేం శాంతియుతంగా ఉన్నాం అన్నారు మేయర్ సురేష్‌ బాబు..