Site icon NTV Telugu

Suresh Babu: ఒక్క రూపాయి అవినీతి చేశానని నిరూపిస్తే రాజకీయ సన్యాసం.. సురేష్‌ బాబు సవాల్..

Mayor Suresh Babu

Mayor Suresh Babu

Suresh Babu: తాను ఒక్క రూపాయి అవినీతి చేశానని నిరూపించినా రాజకీయ సన్యాసం చేస్తానంటూ సవాల్‌ చేశారు కడప మాజీ మేయర్ సురేష్‌ బాబు.. తనపై రాష్ట్ర ప్రభుత్వం అనర్హత వేటు వేసిన తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన సురేష్‌ బాబు.. జిల్లా అధ్యక్షుడిగా వాసు చేసిన వ్యాఖ్యలకు సిగ్గు పడాలని ఫైర్‌ అయ్యారు. నీ కార్యకర్తలపై ఎలా మాట్లాడాలో తెలియదా..? అని ప్రశ్నించారు. సురేష్ బాబు, అంజాద్ బాషా అవినీతి చేసి కడప భ్రష్టు పట్టించారని వాసు ఆరోపించారు.. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ఎంత దోచుకుందో అందరికీ తెలుసు.. 2024 కూటమి అధికారంలోకి ఎమ్మెల్యే నియంతలా మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు.. నీరు చెట్టు కింద బుగ్గవంక పనులు చేసి కార్పొరేషన్ నిధులు వాడుకున్నారు.. ఇక, కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క రోడ్డు వేయలేదు.. బుగ్గవంక సుందరీకరణ పేరుతో దోచుకొని మహానాడు కోసం ఖర్చు చేశారు అని ఆరోపించారు.

Read Also: Akkineni Nagarjuna: ఢిల్లీ హైకోర్టుకు సినీ నటుడు నాగార్జున.. వెంటనే ఆ వీడియోలు తొలగించండి..!

కూటమి ప్రభుత్వం వచ్చి నెలలు అవుతోంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి నిధులు తెచ్చారా..? అని ప్రశ్నించారు సురేష్‌ బాబు.. రాష్ట్ర ప్రభుత్వ నిధులు కార్పొరేషన్ అజెండాలో ఉండవు.. మా ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులు చెప్పుకోగలం.. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అన్ని కూడళ్లను అభివృద్ధి చేశాం అని వెల్లడించారు.. అయితే, వాసు కార్పొరేటర్ కాదు సర్పంచ్ కాదు.. కానీ, టెంకాయలు కొడుతున్నాడు అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.. కడప అభివృద్ధి కోసం మీ ప్రభుత్వం ఒక్క రూపాయి నిధులు కేటాయించలేదు.. బుగ్గవంక అభివృద్ధి పేరుతో పందికొక్కులా దోచుకు తిన్నారు ఆరోపించిన ఆయన.. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మొదటి సమావేశంలో ఎమ్మెల్యే కు గౌరవం ఇచ్చాం.. ఎమ్మెల్యే కేవలం కుర్చీ కోసం కొట్లాడుతున్నారు.. ఎమ్మెల్యే మాధవీ రెడ్డికి అభివృద్ధిపై ద్యాసలేదు అని ఎద్దేవా చేశారు.. కార్పొరేషన్ నిధులతో మున్సిపల్ పాఠశాలల్లో విద్యావాలంటీర్లను నియమించాం.. విద్యా వాలంటీర్ల తీర్మానం ఎమ్మెల్యే అడ్డుకున్నారన్న ఆయన.. ఎమ్మెల్యే తీరు వల్ల విద్యార్థులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.. తాను ఒక్క రూపాయి అవినీతి చేశానని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్‌ చేశారు.. అధికారుల తప్పిదం వల్ల మా కుటుంబం పేరిట అభివృద్ధి పనులు కేటాయించారన్నారు.. ఇక, కొందరు కార్పొరేటర్లు స్వార్థం కోసం మా పార్టీని వీడి టీడీపీలో చేరారు.. కార్పొరేషన్ లో కుర్చీ కోసం నన్ను అడ్డు తొలగించుకున్నారు.. కానీ, ఎమ్మెల్యే కుర్చీలో కూర్చోవడం జరగనివ్వను అంటూ ఛాలెంజ్‌ చేశారు కడప మాజీ మేయర్‌ సురేష్‌బాబు..

Exit mobile version