NTV Telugu Site icon

WPL 2025: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌కు కడప జిల్లా విద్యార్థిని.. హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు

Wpl Auction

Wpl Auction

కడప జిల్లాకు చెందిన ఓ గ్రామీణ విద్యార్థిని స్టార్ క్రికెటర్లతో కలిసి ఆడే అవకాశం వచ్చింది. తాజాగా జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ వేలంలో ఈ విద్యార్థిని అమ్ముడుపోయింది. రూ. 55 లక్షల పారితోషకంతో ఢిల్లీ క్యాపిటల్స్ శ్రీ చరణి అనే విద్యార్ధిని సొంతం చేసుకుంది. శ్రీ చరణి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అమ్మాయి. కడప జిల్లా వీరపనేని మండలం ఎర్రమల్లె గ్రామానికి చెందిన విద్యార్థిని.

Read Also: Jagadish Reddy: దమ్ముంటే రైతులకు ఇచ్చిన హామీలపై చర్చ పెట్టాలి..

ఓ సాధారణ కుటుంబానికి చెందిన శ్రీ చరణి.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025లో ఆడబోతుంది. శ్రీ చరణి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి.. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో చిరు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కాగా.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌కు తమ కుమార్తె సెలెక్ట్ కావడంపై తల్లిదండ్రులు, బంధువులు, గ్రామాస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Earthquake: వనౌటు ద్వీపాన్ని వణికించిన భారీ భూకంపం.. పలు ఎంబసీ కార్యాలయాలు ధ్వంసం

2025లో జరిగే మూడో సీజన్ కోసం బెంగుళూరులో మెగా వేలం నిర్వహించారు. ఈ మెగా వేలంలో మొత్తం 120 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. అందులో 91 మంది భారతీయులు ఉండగా.. 29 మంది విదేశీయులు ఉన్నారు. మొత్తం ప్లేయర్లలో ముగ్గురు అసోసియేట్ నేషన్స్‌కు చెందినవారు ఉన్నారు. భారత ఆటగాళ్ల విషయానికి వస్తే.. 82 మంది అన్‌క్యాప్‌, 9 మంది క్యాప్‌లో ఉన్నారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్‌లో ముంబై ఇండియన్స్ టైటిల్ గెలుచుకుంది. రెండో సీజన్ టైటిల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సొంతం చేసుకుంది. కాగా.. ఈ రెండు సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానంలో నిలిచింది.