కడప జిల్లా కేంద్రంలో అఖిలపక్ష నేతలు తలపెట్టిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది.. పశుసంవర్ధక శాఖ డిడి డాక్టర్ అచ్చన్న మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు అఖిలపక్ష నేతలు ర్యాలీ తలపెట్టారు.. అయితే పోలీసులు ముందస్తుగానే అఖిలపక్ష నేతలను అరెస్టు చేశారు.. నగరంలోని మానస ఇన్ హోటల్ లో బస చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను ముందస్తుగా లాడ్జిలో అరెస్ట్ చేశారు.. అలాగే టిడిపి పోలీసు బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శివశంకర్ రెడ్డి.
Read ALso: NBK 108: బాలయ్య-అనిల్ మంచి జోష్ లో ఉన్నారే…
టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ అమీర్ బాబులను కూడా హౌస్ చేశారు.. కొద్దిసేపటి తర్వాత సిపిఐ రామకృష్ణ, పోలిట్ సభ్యులు శ్రీనివాసుల రెడ్డిలు ర్యాలీ చేపట్టేందుకు కార్యకర్తలతో బయటకు రావడంతో పోలీసులు వారి ఇరువురిని అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు.. ఈ సందర్భంలో పోలీసుల వాహనాలను ఆందొలనాకారులు అడ్డుకున్నారు.. పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది.. తర్వాత పోలీసులు ఆందోళనా కారులను చెదరగొట్టి ఇరువురు నేతలని స్టేషన్ కు తరలించారు… హత్యకు గురైన డిడి దాక్టర్ అచ్చన్న విషయంలో దర్యాప్తు సజావుగా సాగడం లేదని, దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి, దోషులను శిక్షించాలని ఈ సందర్భంగా నేతలు డిమాండ్ చేశారు.
అధికారులు దర్యాప్తును తప్పుదోవ పట్టిస్తున్నారన్న అనుమానాలను వారు వ్యక్తం చేశారు.. మృతదేహం లభ్యం అయ్యాక గువ్వల చెరువు ఘాటులో అన్నమయ్య జిల్లా పోలీసులు కుటుంబ సభ్యులు ఎవరూ లేకుండా పోస్టుమార్టం నిర్వహించడంపై వారు పలు అనుమానం కూడా వ్యక్తం చేశారు. సిపిఐ రామకృష్ణ. శాంతి యుతంగా ప్రజాస్వామ్య బద్ధంగా ఆందోళన చేస్తున్న తమను అరెస్ట్ చేయడం దారుణమని టిడిపి నాయకులు శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.. దాదాపు రెండు గంటల పాటు కడప నగరంలో ఈ అరెస్టు పర్వంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Read Also: SSC Papers: ఏప్రిల్ 13 నుంచి టెన్త్ పరీక్షా పేపర్ల మూల్యాంకనం