Kadapa: కడపలోని పెద్ద దర్గాలో ఉరుసు ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది.. నవంబర్ 16వ తేదీన ప్రారంభమయ్యే ఈ ఉరుసు ఉత్సవాలు వారం రోజుల పాటు ఘనంగా జరుగుతాయి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక మరియు మహారాష్ట్రల నుండి వేలాది మంది భక్తులు ఈ సమయంలో ప్రసిద్ధ సూఫీ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తుంటారు.. నవంబర్ 16 నుండి 21వ తేదీ వరకు జరగనున్న కడపలోని ‘పెద్ద దర్గా’ అని కూడా పిలువబడే అమీన్ పీర్ దర్గాలో వార్షిక ఉరుసు ఉత్సవాలను సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.. భక్తులు దర్గాకు ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయని నమ్ముతారు… ఇక్కడ ప్రార్థనలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు.. అయితే, కడప పెద్ద దర్గా ఉరుసు నేపథ్యంలో రేపు కడపలో అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రటించారు జిల్లా అధికారులు..
Read Also: Cyber Crime: ఢిల్లీ రిటైర్డ్ ఇంజనీర్ డిజిటల్ అరెస్ట్.. రూ.10 కోట్లు కొల్లగొట్టిన స్కామర్లు
పెద్ద దర్గాను ఈ ప్రాంతం ఎంతో పవిత్రమైన స్థలం, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ప్రదేశంగా భావిస్తారు.. ఇక్కడికి చేరుకునే భక్తులు సామాన్య ప్రజలు మాత్రమే కాదు.. పొలిటికల్ లీడర్లు.. సినిమా స్టార్లు.. క్రీడాకారులు.. ఇలా అన్ని రంగాలకి చెందిన ప్రముఖులు కూడా దర్గాను సందర్శిస్తారు.. కుల, మత, భాష ప్రాంతం అనే తారతమ్యం లేకుండా లక్షలాది మంది తరలివస్తుంటారు.. కడప పట్టణంలోని నకాష్ వీధిలో వెలసిన ఈ అమీన్ పీర్ దర్గా.. సుమారు రెండెకరాల విస్తీర్ణంలో అతి సుందరంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది. జిల్లా యంత్రాంగం, పోలీసు, విద్యుత్ శాఖలు, మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు దర్గా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు, నిరంతరాయంగా విద్యుత్, పారిశుద్ధ్య నిర్వహణకు ఏర్పాట్లు చేశారు..