NTV Telugu Site icon

YS Jagan: ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ పిటిషన్.. సోమవారానికి వాయిదా..!

Jagan

Jagan

YS Jagan: ఏపీ హైకోర్టులో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ జరిపింది. అయితే, జగన్ పాస్ పోర్ట్ ఐదేళ్ల పాటు రెన్యూవల్ చేస్తూ.. సీబీఐ కోర్టు ఆదేశాలు ఇచ్చిందని ఏపీ హైకోర్టుకు పిటిషనర్ తెలిపారు. కానీ, ఆ ఆదేశాలను విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు ఏడాదికి పరిమితం చేయడం చట్టవిరుద్ధం అని పిటిషనర్ లాయర్ న్యాయస్థానం దృష్టికి తీసుకు పోయారు.

Read Also: Fire Accident: స్కూల్ అగ్నిప్రమాదంలో 17 మంది విద్యార్థులు మృతి.. 13 మందికి గాయలు..

ఇక, వైఎస్ జగన్ లండన్ టూర్‌కు సీబీఐ కోర్టు పర్మిషన్ ఇచ్చినట్లు కోర్టుకు పిటిషనర్ న్యాయవాది చెప్పగా.. విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని పాస్ పోర్ట్ కార్యాలయం పేర్కొనింది. ఎన్‌ఓసీ తీసుకోవాలని జగన్‌కు పాస్ పోర్ట్ ఆఫీసు లేఖ రాసింది. దీంతో పాస్‌పోర్టుకు ఎన్‌ఓసీ ఇవ్వాలని జగన్ తరపు పిటిషనర్‌ కోరారు. ఈ అంశంలో తదుపరి విచారణను ఏపీ హైకోర్టు సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.

Show comments