NTV Telugu Site icon

YS Jagan: జంతర్ మంతర్ దగ్గర వైఎస్ జగన్ ధర్నా.. సంఘీభావం ప్రకటించిన అఖిలేష్ యాదవ్..!

Akilesh

Akilesh

YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న దాడులు, హింసాత్మాక ఘటనలపై వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆందోళనకు దిగారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. అయితే, వైఎస్ జగన్ చేస్తున్న ధర్నాకు ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మద్దతు ఇచ్చారు.. ఆయనతో కలిసి ధర్నాలో కూర్చోని సంఘీభావం ప్రకటించారు.

Read Also: Nepal : నేపాల్లోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో కూలిన విమానం

ఇక, మాజీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఎవరైతే దాడులకు పాల్పడుతున్నారో వారిపై చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు అని తెలిపారు. నారా లోకేష్ రెడ్ బుక్ చూపిస్తున్నారు.. ఇవాళ వారు అధికారంలోకి వచ్చారు మొన్న మేము అధికారంలో ఉన్నాము.. రేపు మళ్ళీ మేం అధికారంలోకి వస్తామన్నారు. మేము ఎప్పుడు దాడులను ప్రోత్సహించలేదు.. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసాన్ని మేము ప్రోత్సహించ లేదని ఆయన చెప్పుకొచ్చారు. వైసీపీ నేతలపై బహిరంగ దాడులు చేస్తున్నారు.. కార్పొరేటర్లపై దాడులకు దిగుతున్నారు.. బాధితులపై దౌర్జన్యంగా కేసులు పెడుతున్నారు.. ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనకు ఇతర పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను అని జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అయితే, టీడీపీ అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో 30 మందిని చంపారు.. లోకేష్ రెడ్ బుక్ పెట్టుకొని నచ్చని వారిపై దాడి చేస్తున్నారు.. దాడులు, దౌర్జన్యాను కొనసాగిస్తున్నారు.. రాష్ట్రంలో ఇంతకీ ప్రజాస్వామ్యం ఉందాని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.. భయంతో జనం వలస వెళ్తున్నారు అని వైఎస్ జగన్ ఆరోపించారు.