YS Jagan Mohan Reddy Gives Way For Ambulance By Stopping His Convoy: మదెనపల్లిలోని విద్యాదీవెన కార్యక్రమంలో ఒక ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి హెలిపాడ్ నుంచి సభావేదిక వద్దకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్తుండగా.. 108 అంబులెన్స్‌కు దారిచ్చారు. అక్కడి నుంచి ఆంబులెన్స్ వెళ్లేంతవరకూ.. తన కాన్వాయ్‌ను పక్కన ఆపారు. ఆంబులెన్స్ వెళ్లాక, ఆయన కాన్వాయ్ ముందుకు కదిలింది. అనంతరం సీఎం జగన్ విద్యాదీవెన కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోని ఏపీ సీఎంఓ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
మరోవైపు.. విద్యాదీవెన పథకం కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ బటన్ నొక్కి, నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ చేశారు. దీనివల్ల 11.02 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరింది. ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద రూ.12,401 కోట్లు విడుదల చేసింది. ఆర్థికస్తోమత లేక ఏ విద్యార్థి ఉన్నత చదువులకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో.. ఈ పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటును ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పిల్లలకు మన ఇచ్చే ఆస్తి చదువేని, కుటుంబాల తలరాత మారాలన్నా, పేదరికం దూరం కావాలన్నా చదువే మార్గమని అన్నారు.
చదువులకు పేదరికం అవరోధం కావొద్దన్న ఉద్దేశంతోనే దివంగత నేత వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని తీసుకొచ్చారని.. అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ పథకాన్ని నీరుగార్చాయని జగన్ అన్నారు. పాదయాత్రలో విద్యార్థుల కష్టాలు చూసి.. అధికారంలోకి రాగానే జగనన్న విద్యాదీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తున్నామని చెప్పారు. విద్యావ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకొచ్చి, పేదలకు చదువును హక్కుగా మార్చామన్నారు. చంద్రబాబు హయాంలో పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లు చెల్లించి, జగనన్న విద్యాదీవెన కింద రూ.9,052 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ.3,349 కోట్లు కలిపి మొత్తంగా రూ.12,401 కోట్లు అందించామని పేర్కొన్నారు.
విద్యాదీవెన పథకం కార్యక్రమానికి మదనపల్లెలో హెలిపాడ్ నుంచి సభావేదిక వద్దకు వెళ్తుండగా, 108 అంబులెన్స్‌కు దారిచ్చిన ముఖ్యమంత్రిగారు ప్రయాణిస్తున్న బస్సు. pic.twitter.com/9DRcO5PTbb
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) November 30, 2022
