Site icon NTV Telugu

YS Jagan: తెలుగు వారందరికీ దుర్గాష్టమి, విజయదశమి శుభాకాంక్షలు..

Jagan

Jagan

YS Jagan: దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి పండుగలను పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. లోక కంఠకుడైన మహిషాసురుడిని జగన్మాత సంహరించినందుకు, చెడుపై మంచి, దుష్ట శక్తులపై దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండగే విజయదశమి.. చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శక్తిమంతమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుంది అని వైఎస్ జగన్ తెలిపారు.

Read Also: Dussehra : ట్రైసిటీలో దసరా ఉత్సవాల.. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..

అయితే, అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ అనుగ్రహం కోసం.. నవరాత్రులు అత్యంత భక్తిశ్రద్ధలతో దుర్గామాతను పూజిస్తారు అని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు అందరూ సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలు అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు సిద్ధించాలి.. ఆ కనక దుర్గమ్మవారి దీవెనలు, ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి అని జగన్ కోరారు.

Exit mobile version