Site icon NTV Telugu

YS Jagan: ఏపీ ఆర్థిక పరిస్థితులపై జగన్ ఆందోళన..

Jagan

Jagan

YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదాయాలు లేకపోగా, శరవేగంగా అప్పులు పెరగటంపై జగన్ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా కాగ్ నివేదికను తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ (ట్వీట్టర్)లో పోస్ట్ చేశాడు. ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం మరింత అప్పుల్లో కూరుకుపోయింది.. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే రాష్ట్రంపై తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి ఏర్పడింది.. ఈ విషయాన్ని కాగ్ తన నివేదికలోనే స్పష్టం చేసింది.. రాష్ట్రంలో ఆర్థిక స్థిరత్వం, నిర్వహణ సరిగా లేనేలేదు.. రాష్ట్ర విభజనతో మొదలైన సమస్య మరింత తీవ్రరూపం దాల్చింది అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

Read Also: Bharathi Builders: హైదరాబాద్‌లో మరో ప్రీ-లాంచ్ స్కాం బట్ట బయలు.. అయోమయంలో 250 మంది బాధితులు..!

ఇక, దీనికి తోడు రాష్ట్రంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది అని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్. ఖజానాకు రావాల్సిన ఆదాయం రాకుండా పోతోంది.. పన్ను ఆదాయం, పన్నేతర ఆదాయాలు పేలవంగా ఉన్నాయి.. కొన్ని శాఖల్లోనైతే అత్యంత అధ్వాన్నమైన వృద్దిరేటు కనిపించింది.. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో GST ఆదాయాలు, అమ్మకపు పన్ను ఆదాయాలు గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి.. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రాష్ట్ర సొంత ఆదాయాలు కేవలం 3.47 శాతం మాత్రమే పెరిగాయి.. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే ఆదాయాలతో సహా మొత్తం ఆదాయాలు 6.14% మాత్రమే పెరిగింది.. అప్పులు మాత్రం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో ఏకంగా 15.61% వేగంతో పెరిగాయని వైఎస్ జగన్ తెలిపారు.

Exit mobile version