NTV Telugu Site icon

YV Subba Reddy: జగన్ ఎందుకు రాజీనామా చేస్తారు..

Yv

Yv

YV Subba Reddy: వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎందుకు రాజీనామా చేస్తారు అని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. జగన్ రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తారన్న వార్తలు వాస్తవం కాదు..విభజన చట్టం ప్రకారం ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది.. హామీల అమలుకు పోరాటం చేయాలి.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని సమస్యలపై చర్చించటం మంచి పరిణామమే అని ఆయన తెలిపారు. రాష్ట్రం అభివృద్ది చెందాలంటే ప్రత్యేక హోదా రావాలి.. ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉంది.. రెండు చోట్లా వాళ్ళే ఉన్నారు కాబట్టి హోదా తేవాలి.. రెండు రాష్ట్రాల సమస్యలు ఇద్దరు సీఎంలు మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి.. నిన్న ఉచిత ఇసుక అని ప్రకటించి ఒక్క రోజులోనే బ్రహ్మాండంగా నిర్మాణాలు జరుగుతున్నాయని చెబుతున్నారు అని వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

Read Also: Hathras Stampede : భోలే బాబాకు క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం… సిట్ నివేదికపై మాయావతి ఆరోపణలు

ఇక, పేదలకు ఉచిత ఇసుక ఇస్తే మంచిదే.. స్వాగతించాల్సిన పరిణామం అని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. మేము ఇసుకలో అక్రమాలు చేశామని దుష్ప్రచారం చేయటం తగదు.. ఉచిత ఇసుక అంటూనే టన్నుకు కొంత మొత్తం వసూలు చేస్తున్నారు.. టీడీఆర్ బాండ్ల విషయంలో మేము అవినీతి చేసినట్లు నిరూపిస్తే నిరభ్యంతరంగా విచారణ చేసుకోవచ్చు.. మా ప్రభుత్వంలో ఎక్కడా అవినీతి జరగలేదు.. అవినీతి చేశామని వాళ్ళు భావిస్తే వాళ్ళ ప్రభుత్వమే అధికారంలో ఉంది.. విచారణ చేసి మా అవినీతి నిరూపించాలి అని వైవీ సుబ్బారెడ్డి సవాల్ చేశారు.

Show comments