ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తించిన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండల పరిషత్ అధ్యక్ష పదవి వైసీపీ ఖాతాలో చేరింది. ఎంపీటీసీల పరంగా చూసుకుంటే ప్రతిపక్ష టీడీపీకి మెజారిటీ ఉన్నా తాజా పరిణామాలతో పరిస్థితి తారుమారైంది. ఈ మేరకు దుగ్గిరాల ఎంపీపీగా వైసీపీకి చెందిన ఎంపీటీసీ సంతోషి రూపారాణి ఎన్నికయ్యారు. ఆమె ఎన్నిక ఏకగ్రీవంగా జరిగిందని అధికారులు ప్రకటించారు.
దుగ్గిరాల ఎంపీపీ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కాగా… ఆ వర్గానికి చెందిన ఎంపీటీసీలు టీడీపీలో ఎవరూ లేరు. దీంతో వైసీపీ తన అభ్యర్థిగా సంతోషి రూపారాణి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ బీ ఫారం అందజేసింది. రూపారాణి అభ్యర్థిత్వం తప్ప మరో పార్టీ నుంచి పోటీ లేకపోవడంతో అధికారులు ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. దీంతో వెంటనే రూపారాణి ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు దుగ్గిరాల మండల పరిషత్‌కు సంబంధించి రెండు ఉపాధ్యక్ష పదవులు ఉన్నాయి. వాటిలో ఓ పదవిని టీడీపీ దక్కించుకోగా, ఇంకో పదవిని జనసేన చేజిక్కించుకుంది. టీడీపీ ప్రతిపాదించిన షేక్ జబీన్, జనసేన ప్రతిపాదించిన పసుపులేటి సాయి చైతన్య వైస్ ఎంపీపీలుగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.
CM Jagan: టెన్త్ పేపర్లు లీక్ చేసింది శ్రీచైతన్య, నారాయణ కాలేజీ వాళ్లే
