NTV Telugu Site icon

త్వరలోనే ఏపీలో కరెంట్ కష్టాలు తీరతాయి: విజయసాయిరెడ్డి

ఏపీలో గత మూడు రోజులుగా కరెంట్ కష్టాల కారణంగా ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో కరెంట్ కోతలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఏపీలో కరెంట్ కష్టాలు త్వరలో తీరనున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో శ్రీకాకుళం జిల్లాలో ఆరు అణు విద్యుత్ రియాక్టర్లు ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖంగా ఉందని వెల్లడించారు.

Read Also: సీఎం జగన్ తో ముగిసిన మంత్రుల కమిటీ భేటీ

కరెంట్ కష్టాలపై రాజ్యసభలో తాను అడిగిన ప్రశ్నకు కేంద్ర శాస్త్ర సాంకేతిక విజ్ఞాన శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సమాధానమిచ్చారని విజయసాయిరెడ్డి వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్కటి 1,208 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం కలిగిన ఆరు రియాక్టర్లు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రమంత్రి వివరించారని ఆయన తెలిపారు. అయితే ఇవి దేశీయంగా తయారైన రియాక్టర్లు కాకపోయినా ఏపీలో నెలకొన్న విద్యుత్ అవసరాలు తీర్చుతాయన్న నమ్మకం ఉందని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.