NTV Telugu Site icon

Vijaya Sai Reddy: చంద్రబాబు ఒట్టు తీసి కరకట్ట గట్టున పెట్టేశాడు

Vijaya Sai Reddy

Vijaya Sai Reddy

YCP MP Vijaya Sai Reddy: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్లు వేశారు. ఈరోజు రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా అసెంబ్లీలో చంద్రబాబు ఓటు హక్కు వినియోగించుకోవడంపై విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం అయ్యేదాకా అసలు అసెంబ్లీ గడప తొక్కనని గతంలో చంద్రబాబు మంగమ్మ శపథం చేశాడని, ఇప్పుడు ఆ ఒట్టు తీసి గట్టున పెట్టేసి అసెంబ్లీకి వెళ్లి ఓటు వేశాడని విజయసాయిరెడ్డి చురకలు అంటించారు. ఇకపై ఎప్పటికీ సీఎం కాలేనని చంద్రబాబుకు స్పష్టత వచ్చిందని అభిప్రాయపడ్డారు. పచ్చ కుల మీడియా మాత్రం పిచ్చిగా చెలరేగుతోందని విజయసాయిరెడ్డి విమర్శించారు. ఈ మేరకు చంద్రబాబు ఓటు వేసిన వీడియోను, గతంలో చంద్రబాబు ప్రెస్ మీట్‌లో కంటనీరు పెట్టిన దృశ్యాలను కలిపి ట్విట్టర్‌లో విజయసాయిరెడ్డి షేర్ చేయగా అది వైరల్‌గా మారింది.

అటు ఢిల్లీలోని పార్లమెంట్‌ హౌస్‌లో జరుగుతున్న రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొని ద్రౌపది ముర్ముకు ఓటు వేసినట్లు విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో వెల్లడించారు. ఈ ఎన్నిక ద్వారా తొలిసారిగా ఒక ఆదివాసీ గిరిజన మహిళ భారత రాష్ట్రపతి కాబోతున్నారని ఆయన చెప్పారు.

Show comments