Site icon NTV Telugu

సామాజిక న్యాయం చేత‌ల్లో చూపించిన నాయ‌కుడు సీఎం జ‌గ‌న్…

ఆరుసార్లు ఎమ్మెల్యే,. మూడు సార్లు సి ఎం ప‌ద‌వి అనుభ‌వించిన చంద్ర‌బాబు వంగి వంగి దండాలు పెట్టినా కుప్పం ప్ర‌జ‌లు క‌నిక‌రించ‌ని ప‌రిస్థితి క‌నిపిస్తోంది అని వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి అన్నారు. “ద్రోహం” అన్న పదానికి ప‌ర్యాయ‌ప‌దం చంద్ర‌బాబు. డ‌బ్బులు, మ‌ద్యం, బంగారం, బైకులు పంపిణీతో గెలుస్తామ‌నుకుంటే 2019లో టిడిపినే విజ‌యం సాదించేద‌ని, మంగ‌ళగ‌రిలో లోకేష్ రికార్డు సృష్టించేవాడు. అమిత్ షాను క‌ల‌వ‌డానికి బాబుకు మోహం చెల్ల‌డం లేదు. డ‌బ్బు, మ‌ద్యం, బంగారంతో ఓటర్ల‌ను కొన‌లేవు బాబు. పార్టీ శ్రేణుల‌ను రెచ్చ‌గొట్టి అల‌జ‌డి సృష్టించ‌డ‌మే తేదేపా నైజం. పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు ఓటు హ‌క్కు వినియోగించుకోవాలి. సామాజిక న్యాయం చేత‌ల్లో చూపించిన నాయ‌కుడు సీఎం జ‌గ‌న్ అని పేర్కొన్నారు.

Exit mobile version