టీడీపీ నేత, మాజీ ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడుపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఆయనో కట్టప్ప అంటూ ఎద్దేవా చేశారు. ఏపీ చరిత్రలోనే అత్యంత చెత్త ఆర్థిక మంత్రి ఎవరంటే ఆయన పేరే వినిపిస్తుందని అన్నారు. ఒక ఏడాదిలో 300 రోజులకుపైగా ఓవర్ డ్రాఫ్ట్.. వేస్ అండ్ మీన్స్‌కు వెళ్లిన చరిత్ర ఆయనది అంటూ విజయసాయిరెడ్డి ఆరోపించారు.
Read Also: 26 జిల్లాలు ఎలా వస్తున్నాయో.. మూడు రాజధానులు అలాగే వస్తాయి: మంత్రి అవంతి
టీడీపీ ప్రభుత్వ వైఖరి వల్ల ప్రస్తుతం వివిధ పథకాలకు ఆర్థిక వనరుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా తానో పెద్ద మేధావినంటూ నీతి వచనాలు వల్లిస్తారని అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు ఆయన్ను ఏనాడో మరచిపోయారని.. యనమల ఓ నమ్మక ద్రోహి అంటూ విజయసాయిరెడ్డి విమర్శించారు.
