NTV Telugu Site icon

Vasantha Krishna Prasad: దేవినేని ఉమా.. మంత్రి మల్లారెడ్డి లాగా పూలు, పాలు అమ్మావా?

Vasantha On Uma

Vasantha On Uma

YCP MLA Vasantha Krishna Prasad Fires On Devineni Uma: వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తాజాగా మాజీమంత్రి దేవినేని ఉమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు కంచికచర్లలో కూల్‌డ్రింక్ షాప్ నడిపిన దేవినేని ఉమా.. ఐదుసార్లు ఎలా పోటీ చేశారు? అని ప్రశ్నించారు. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి తరహాలో పూలు, పాలు అమ్మావా? అని నిలదీశారు. ఇసుక, మట్టి అమ్ముకోవడం తప్ప నువ్వు ఏ వ్యాపారం చేశావో చెప్పు? అని అడిగారు. దేవినేని ఉమా వైసీపీకి అనుకూల శత్రువని, దేవినేని ఉమా లాంటి నాయకుడు ఉండబట్టే కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ కకావికలం అయ్యిందని ధ్వజమెత్తారు. దేవినేని ఉమా చరిత్ర ఏంటో అందరికీ తెలుసన్న ఆయన.. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆయన మైలవరం ప్రజలకు చేసిన మేలు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.

farmers Support to Wrestlers: రెజ్లర్లకు మద్ధతుగా రైతుల భారీ సభ

ఒక్కసారి గెలిచిన కృష్ణ ప్రసాద్‌కు అంత బలుపా అని ఉమా మాట్లాడుతున్నారని.. అవును తనకు బలుపేనంటూ వసంత కృష్ణప్రసాద్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నువ్వు నాలుగు సార్లు గెలిచినా.. నీ గెలుపు ఎటువంటి గెలుపో చెప్పాలని అడిగారు. అన్నా వదినల బలిదానంతో దేవినేని ఉమా గెలిచాడని.. అది గెలుపు కాదని తేల్చి చెప్పారు. 2019లో మంత్రిగా ఉన్న నిన్ను.. 13 వేల ఓట్ల తేడాతో ఓడించానని, అదీ అసలైన గెలుపని ఉద్ఘాటించారు. మంత్రి మల్లారెడ్డిలాగే తాను కూడా ఎంతో కష్టపడి ఎదిగానని చెప్పుకుంటున్న దేవినేని ఉమా.. ఏం వ్యాపారం చేశాడో చెప్పాలని నిలదీశారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి నాయకులు తెలుగుదేశం పార్టీని వదిలి.. వైసీపీలోకి చేరడానికి కారణం దేవినేని ఉమానే అని ఆరోపించారు. టీడీపీలో ఉన్న క్రియాశీల నాయకులు పని చేయకపోవడానికీ ఆయనే కారణమని పేర్కొన్నారు.

Sajjala Ramakrishna: అవినాష్‌కు ముందస్తు బెయిల్ మంజూరైంది.. న్యాయం తేలింది