AP New Districts: సీమకు సముద్రం.. రోజా సంతోషం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జిల్లాల విభజనతో ఏపీ భౌగోళిక స్వరూపం మారిపోయింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ప్రభుత్వం ప్రకటించడంతో పాత జిల్లాలలో మార్పులు చోటు చేసుకున్నాయి. కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్రలో జిల్లాల సంఖ్య పెరిగింది. ఒకప్పుడు అతి పెద్ద జిల్లాగా ఉన్న విశాఖ ఇప్పుడు చిన్న జిల్లాగా మారిపోయింది. మరోవైపు రాయలసీమలో ఎన్నడూ ఊహించని మార్పులు జరిగాయి. జిల్లాల విభజన జరిగిన తర్వాత రాయలసీమ పరిధిలోకి సముద్రతీరం రావడం కూడా ఆశ్చర్యపరుస్తోంది.
గతంలో నెల్లూరు జిల్లాలో తీరప్రాంతం ఉన్న సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం తిరుపతి జిల్లాలో కలిసింది. అలాగే సముద్రతీరంలో ఉన్న మరో అసెంబ్లీ నియోజకవర్గం గూడూరు కూడా తిరుపతి జిల్లాలో చేరింది. దీంతో రాయలసీమ పరిధిలో ఉన్న తిరుపతి జిల్లాకు సముద్రం వచ్చేసింది. రాయలసీమకు సముద్రం రావడంతో ఎమ్మెల్యే రోజా కూడా ఆసక్తికరంగా ట్వీట్ చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి జిల్లాలు ఏర్పాటు చేసిన సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. 26 జిల్లాల కొత్త ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరింత వేగంగా దూసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. పునర్వ్యవస్థీకరణలో సీమకు సముద్రం రావడం చాలా సంతోషంగా ఉందంటూ రోజా ట్వీట్ చేశారు.
Also Read
- Rain Alert: కొనసాగుతోన్న అల్పపీడనం.. రాబోయే 24 గంటల్లో ఆ 13 జిల్లాలో వర్షాలు!
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
- YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్‌లతో ఎక్స్‌లో పోస్టులు!
- Ganesh Idol Protest: 'వినాయకుడి'తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
ఇచ్చిన మాటకు కట్టుబడి జిల్లాల పునర్ విభజనకు శ్రీకారం చుట్టిన సీఎం శ్రీ వైఎస్ జగన్ గారికి ధన్యవాదాలు. 26 జిల్లాల కొత్త ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరింత వేగంగా దూసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాను.
పునర్‌వ్యవస్థీకరణలో సీమకు సముద్రం రావడం సంతోషంగా ఉంది.#26DistrictsInAP pic.twitter.com/TALL7gUZzu
— Roja Selvamani (@RojaSelvamaniRK) April 4, 2022
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!