Site icon NTV Telugu

AP New Districts: సీమకు సముద్రం.. రోజా సంతోషం

Ycp Mla Roja

Ycp Mla Roja

జిల్లాల విభజనతో ఏపీ భౌగోళిక స్వరూపం మారిపోయింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ప్రభుత్వం ప్రకటించడంతో పాత జిల్లాలలో మార్పులు చోటు చేసుకున్నాయి. కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్రలో జిల్లాల సంఖ్య పెరిగింది. ఒకప్పుడు అతి పెద్ద జిల్లాగా ఉన్న విశాఖ ఇప్పుడు చిన్న జిల్లాగా మారిపోయింది. మరోవైపు రాయలసీమలో ఎన్నడూ ఊహించని మార్పులు జరిగాయి. జిల్లాల విభజన జరిగిన తర్వాత రాయలసీమ పరిధిలోకి సముద్రతీరం రావడం కూడా ఆశ్చర్యపరుస్తోంది.

గతంలో నెల్లూరు జిల్లాలో తీరప్రాంతం ఉన్న సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం తిరుపతి జిల్లాలో కలిసింది. అలాగే సముద్రతీరంలో ఉన్న మరో అసెంబ్లీ నియోజకవర్గం గూడూరు కూడా తిరుపతి జిల్లాలో చేరింది. దీంతో రాయలసీమ పరిధిలో ఉన్న తిరుపతి జిల్లాకు సముద్రం వచ్చేసింది. రాయలసీమకు సముద్రం రావడంతో ఎమ్మెల్యే రోజా కూడా ఆసక్తికరంగా ట్వీట్ చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి జిల్లాలు ఏర్పాటు చేసిన సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. 26 జిల్లాల కొత్త ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరింత వేగంగా దూసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. పునర్వ్యవస్థీకరణలో సీమకు సముద్రం రావడం చాలా సంతోషంగా ఉందంటూ రోజా ట్వీట్ చేశారు.

Exit mobile version