NTV Telugu Site icon

YSRCP: ఈనెల 26 నుంచి 29 వరకు ఏపీ మంత్రుల బస్సు యాత్ర

Jagan

Jagan

 

ఏపీలో ఈనెల 26 నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు బస్సు యాత్ర చేపట్టాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మంత్రులు నిర్ణయించారు. ఈ మేరకు 17 మంది మంత్రులు, ప్రజా ప్రతినిధులు చేపట్టే బస్సు యాత్ర రూట్ మ్యాప్, సభల ఏర్పాటుపై చర్చించేందుకు సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో ఈనెల 26 నుంచి 29 వరకు 17 మంది మంత్రులు, ప్రజా ప్రతినిధులు బస్సు యాత్రలు నిర్వహించి బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఉత్తరాంధ్రలో తొలి సభతో మంత్రుల బస్సు యాత్ర ప్రారంభం కానుంది.

Actor Ali: రాజ్యసభ సీటు ఆశించలేదు.. కానీ జగన్ దృష్టిలో నేనున్నాను

శ్రీకాకుళంలో తొలి బహిరంగ సభ, రాజమండ్రిలో రెండో బహిరంగ సభ, నర్సరావుపేటలో మూడో బహిరంగ సభ, అనంతపురంలో నాలుగో బహిరంగ సభ నిర్వహించి యాత్రను ముగించాలని మంత్రులు సీఎం జగన్ దగ్గర ప్రతిపాదన చేయగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ బస్సు యాత్రలలో వైసీపీ ప్రభుత్వ హయాంలో బలహీనవర్గాలకు ఉంటున్న ప్రాధాన్యం, అందుతున్న పథకాలను మంత్రులు ప్రజలకు వివరించనున్నట్లు సమాచారం. కాగా బస్సు యాత్ర, సభల కార్యక్రమానికి పేర్ల ప్రతిపాదనపై సీఎంతో సమావేశంలో చర్చ జరిగింది. ఈ మేరకు పరిశీలనలో జయహో జగనన్న, సామాజిక న్యాయ నిర్మాత వంటి పలు పేర్లను మంత్రులు సూచించారు.

Show comments