YCP Leaders Protest: బెజవాడ అంబేద్కర్ విగ్రహం దగ్గర వైసీపీ నేతలు నిరసన చేస్తున్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ నిరసన తెలిపారు. కాంస్య విగ్రహం ఆవిష్కరణ శిలాఫలకంపై ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరును గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తొగలించటంతో నిరసన తెలిపారు.
Read Also: Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్‌కి పెరిగిన వరద.. లంక గ్రామాలకు అలర్ట్..!
ఈ సందర్భంగా మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్రంలో రక్షణ లేదు అని ఆరోపించారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇక్కడ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పాలకులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని భక్షించాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టు రాత్రి ఘటన స్పష్టంగా కనిపిస్తుంది.. ఇప్పటికే గ్రామ గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన చేయాలని వైసీపీ తరపున పిలుపు ఇచ్చామన్నారు. ఈ విషయంపై లిఖిత పూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశామని మాజీ మంత్రి మేరుగ నాగార్జున వెల్లడించారు.