NTV Telugu Site icon

YCP Leader KSN Raju: ఎమ్మెల్యే రాపాకను ప్రలోభ పెట్టిన మాట వాస్తవమే.. వైసీపీ లీడర్ క్లారిటీ

Ksn Raju On Rapaka Comments

Ksn Raju On Rapaka Comments

YCP Leader KSN Raju Gives Clarity On TDP Offer To MLA Rapaka: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకే మొదటి బేరం వచ్చిందని, టీడీపీ తనకు రూ.10 కోట్లు ఆఫర్ చేసిందని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కుండబద్దలు కొట్టిన విషయం తెలిసిందే! తన మిత్రుడైన కేఎస్ఎన్ రాజుతో టీడీపీ నేతలు సంప్రదింపులు జరిపారని, టీడీపీకి ఓటు వేయాలని ఆయన్ను కోరారని చెప్పారు. ఈ మాట వాస్తవమేనంటూ తాజాగా వైసీపీ నాయకుడు కేఎస్ఎన్ రాజు ధృవీకరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రాపాకను ప్రలోభ పెట్టిన మాట వాస్తవమేనని, ఎమ్మెల్యే ఓటు కోసం ఓ టీడీపీ నేత తనని సంప్రదించారని స్పష్టం చేశారు. మొదట తాను ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదన్న ఆయన.. త్వరలోనే ప్రలోభ పెట్టిందెవరో పార్టీ అధిష్టానానికి తెలియజేస్తానని అన్నారు. తన వద్ద ప్రస్తావించిన రోజే తాను తిరస్కరించానని, ఈ విషయాన్ని తొలుత తాను ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకు వెళ్లలేదని చెప్పారు. అయితే.. ఓ సందర్భంలో రాపాక తనతో చెప్పడంతో, ఆ సమయంలోనే తాను ఆ విషయాన్ని బయటపెట్టారన్నారు. వైసీపీలో కమిట్మెంట్‌తో పని చేస్తున్నామని, ఏ తప్పు చెయ్యమని తెలిపారు. తాము కావాలని చేస్తే.. ఆనాడే విషయాన్ని బయటపెట్టేవాళ్లమని చెప్పుకొచ్చారు.

Planes Collide: గగనతలంలో తృటిలో తప్పిన ప్రమాదం.. రెండు విమానాలు ఢీకొనబోయి..

ఇదిలావుండగా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసిన నలుగురు ఎమ్మెల్యేలను టీడీపీ కొనుగోలు చేసిందని వైసీపీ ఆరోపణలు చేసిన సంగతి విదితమే! అయితే.. ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని, తాము డబ్బులు తీసుకున్నట్టు నిరూపించాలని సస్పెండ్ అయిన ఆ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే తనకు టీడీపీ రూ. 10 కోట్లు ఆఫర్ చేసిందంటూ ఎమ్మెల్యే రాపాక బాంబ్ పేల్చారు. టీడీపీకి అనుకూలంగా ఓటు వేస్తే తన భవిష్యత్ చాలా బాగుంటుందని టీడీపీ ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించిందని అన్నారు. అసెంబ్లీ దగ్గర కూడా ఓ రాజుగారు తనతో బేరానికి వచ్చారని కూడా తెలిపారు. అయితే.. తన వద్ద ఆల్రెడీ డబ్బులు బాగా ఉన్నాయనే ఉద్దేశంతో తాను ఈ ఆఫర్‌ని తిరస్కరించలేదని, సిగ్గు-శరం వదిలేసి ఉంటే తనకు ఆ రూ.10 కోట్లు వచ్చి ఉండేవని పేర్కొన్నారు. కానీ.. ఒకసారి పరువుపోతే సమాజంలో తలెత్తుకుని తిరగలేమన్నారు. జగన్ నాయకత్వాన్ని నమ్మాను కాబట్టే తాను టీడీపీ ఆఫర్‌ని తిరస్కరించానని వెల్లడించారు. తనతో టీడీపీ బేరాలు జరిపిన విషయాన్ని వైసీపీ ఎమ్మెల్యే సతీష్, మంత్రి వేణుగోపాల కృష్ణకు చెప్పానన్నారు. ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారని పార్టీకి ముందే తెలుసని పేర్కొన్నారు.

MP Mithun Reddy: ఆ నలుగురు ఎమ్మెల్యేలను ఆధారాలతోనే సస్పెండ్ చేశాం