Site icon NTV Telugu

Chandrababu: అంబేద్కర్ కంటే జగన్ గొప్పవాడా? అన్ని కులాలు నా కులాలే

Chandrababu

Chandrababu

Chandrababu: గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో పలువురు వైసీపీ నేతలు టీడీపీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా తెనాలికి చెందిన వైసీపీ నేత గుదిబండ గోవర్ధన్‌రెడ్డి తన అనుచరులతో పాటు టీడీపీలో చేరారు. దుగ్గిరాల మాజీ ఎమ్మెల్యే వెంకట‌రెడ్డి సోద‌రుడి కుమారుడే గోవ‌ర్ధన్ రెడ్డి. ప‌దేళ్ల పాటు వైసీపీలో కొన‌సాగిన ఆయ‌న తాజాగా టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా గోవ‌ర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ఆరోప‌ణ‌లు చేశారు. జ‌గ‌న్ మ‌ళ్లీ సీఎం అయితే రాష్ట్రానికి భ‌విష్యత్ ఉండ‌ద‌న్న భావ‌న‌లో ప్రజ‌లు ఉన్నార‌ని.. ఓ స్పష్టమైన ల‌క్ష్యంతోనే తాను టీడీపీలో చేరుతున్నాన‌ని ప్రకటించారు.

Read Also: Ys Sharmila: ఉప ఎన్నికలతో అభివృద్ధా? …సిగ్గుచేటు

అటు టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గత మూడేళ్లు వైసీపీ ప్రభుత్వం అరాచకాలతో పాలన సాగిస్తోందని.. వైసీపీ పాలన పట్ల ప్రజలు విసుగు, ఆవేదన చెందుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇందుకు నిద‌ర్శన‌మే గోవ‌ర్ధన్ రెడ్డి ఆ పార్టీని వీడ‌ట‌మే అని చెప్పారు. మ‌న‌సున్న కార్యకర్తలు వైసీపీలో కొన‌సాగేందుకు ఇష్టప‌డ‌టం లేద‌న్నారు. వైసీపీ నేతలు సెటిల్ మెంట్ రాజకీయాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని.. దీంతో చాలా మంది తాము సంపాదించుకున్న సొమ్మును వైసీపీ నేతలు ధారాదత్తం చేస్తున్నారని.. ప్రాణం కంటే ఆస్తి ఎక్కువ కాదని ప్రజలు వదులుకుంటున్న పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని చంద్రబాబు విమర్శలు చేశారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని.. నిరసనలు చేపడుతుంటే ఇంటి ముందు తాళ్లు కట్టి తమను అడ్డుకుంటున్నారని.. ఈ తాళ్లే వైసీపీ వాళ్లకు ఉరితాళ్లుగా మారతాయని చంద్రబాబు హెచ్చరించారు. జీవితంలో తాను భయపడే ప్రసక్తే లేదన్నారు. వైసీపీ అరాచకాలతో ప్రజలు భయపడుతుంటే తనకు ఎంతో బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

అంబేద్కర్ కంటే జగన్ గొప్పవాడా అని చంద్రబాబు ప్రశ్నించారు. విదేశీ విద్యా దీవెనకు అంబేద్కర్ పేరు తీసేసి తన పేరు పెట్టుకుంటారా అని మండిపడ్డారు. దేశంలో ఎవరూ జగన్ తరహాలో అంబేద్కర్‌ను అవమానించలేదన్నారు. చేతకాని వాడే కులాల గురించి మాట్లాడతారని తన అభిప్రాయమని.. అన్ని కులాలు తన కులాలే అని స్పష్టం చేశారు. అనంతపురంలో కియా పెడితే బడుగులకే ఎక్కువ లబ్ది చేకూరిందన్నారు. కుప్పంలో 100 కమ్మ కుటుంబాలు కూడా ఉండవని.. తనకు ఓట్లేసి గెలిపించింది బడుగులే అని తెలిపారు. ఏ కులంలో పేదరికం ఉంటే.. ఆ కులానికే తన ప్రాధాన్యత అన్నారు.

Exit mobile version