తాడేపల్లిలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లు, పరిశీలకులు, జేసీఎస్ కోర్డినేటర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో దొంగ ఓట్ల గుర్తింపు, ఓటర్ల నమోదుపై వైసీపీ పార్టీ ఫోకస్ పెట్టిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్క నియోజకవర్గంలో పార్టీ మెజారిటీ సాధించే దిశగా పార్టీ శ్రేణులు పని చేసి.. మరోసారి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీని అధికారంలోకి తీసుకురావాలని ఆయన సూచించారు.
Read Also: Yogi Adityanath: బీజేపీ భవిష్యత్ విజయాలపై కీలక జోస్యం చెప్పిన యోగి
ప్రతి ఓటర్ ను పోలింగ్ బూత్ లో ఓటు చేయించే విధంగా అందరు సమన్వయంతో పని చేయాలి అని వైసీపీ రాష్ట్ర ప్రధాని కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఉన్న దొంగ ఓట్ల తొలగింపు, అర్హులైన వారికి ఓటుహక్కు లభించేలా అందరు దృష్టి సారించాలి అని సజ్జల చెప్పారు. నియోజకవర్గ పరిశీలకులు, ఎమ్మెల్యే, ఇన్ ఛార్జ్ లకు సహకారం అందించాలి అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
Read Also: Health News: జర్వం వచ్చినప్పుడు బాలింతలు పిల్లలకు పాలు ఇవ్వొచ్చా?
సమన్వయంతో ప్రతి ఒక్కరు పని చేయాలి అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జేసీఎస్ సచివాలయ కన్వీనర్లు, మండల కన్వీనర్లు, గృహ సారథులు అందరికి పార్టీ అండగా ఉంటుంది అని ఆయన హామీ ఇచ్చారు. పని చేసిన వారికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుంది.. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పి కొట్టాలి అని వైసీపీ రాష్ట్ర ప్రధాని కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు.
Read Also: Viral video:ఇదేందయ్యా ఇది…బోగీల్లో కరెంటు లేదని టీటీఈని టాయిలెట్‌లో బంధించిన ప్రయాణికులు!
రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో 60 లక్షల దొంగ ఓట్లు నమోదు చేశారనే ఆరోపణలు ఉన్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వాటిని గుర్తించి ఎన్నికల కమీషన్ దృష్టికి తీసుకువెళ్లాలి.. వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇది కీలకమైన అంశం.. కాబట్టి పూర్తిగా మనస్సు పెట్టి ప్రతి ఒక్కరు పని చేయాలి అని ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.