NTV Telugu Site icon

YSRCP Clean Sweep: జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్..

Gvmc

Gvmc

జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్‌ చేసింది అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ… పది స్థానాల్లోనూ వైసీపీ కార్పొరేటర్లు విజయం సాధించారు.. అయితే, టీడీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగినట్టు తెలుస్తుంది.. ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలను అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో పాటు.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.. ఈ ఎన్నికల్లో 98 డివిజన్లకు గాను 93 మంది కార్పొరేటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.. మొత్తంగా పదికి పది స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది.. కాగా, జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది.. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఎన్నికల బరిలో ఉన్నామని గతంలోనే ప్రకటించారు జీవీఎంసీ ఫ్లోర్‌లీడర్‌ పీలా శ్రీనివాస్‌.. అయితే, ఈ ఎన్నికల్లో అనూహ్యంగా అధికార వైసీపీ అన్ని స్థానాలను దక్కించుకుంది.. ఇక, గెలిచిన స్టాండింగ్ కమిటీ సభ్యులను అభినందించారు మాజీ మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్..