Site icon NTV Telugu

Nadendla Manohar: రాజకీయాల్లో మహిళలు మరింతగా ఎదగాలి..

Nadeldla

Nadeldla

Nadendla Manohar: అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల పూర్తి భద్రతకి ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో వంద శాతం చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మహిళలు అన్ని రంగాల్లోనూ శిక్షణ పొందాలి అని సూచించారు. సర్వైకల్, బ్రెస్ట్ క్యాన్సర్ టెస్టింగుల కోసం త్వరలో ప్రత్యేక కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టబోతున్నాం.. వాట్సాప్ ద్వారా రెండు వందల సేవలు రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.. మన జిల్లా, మన మండలం, మన ప్రాంతాల అభివృద్ధికి మహిళల తోడ్పాటు ఎంతో అవసరం అని పేర్కొన్నారు. ప్రతి పాఠశాల, ప్రతి హాస్టల్లో ఫైన్ రైస్ అందించబోతున్నాం.. రాజకీయాల్లో మహిళలు మరింతగా ఎదగాలి అని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు.

Exit mobile version