NTV Telugu Site icon

Woman Protest: కృష్ణా నదిలో మహిళ దీక్ష.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Woman Protest

Woman Protest

ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఓ మహిళ దీక్షకు దిగింది. తన భర్త దాంపత్య జీవితానికి పనికిరాడని.. ఈ విషయం తెలిసి కూడా తమ కుమారుడితో తనకు పెళ్లి చేసి అత్తామామలు జీవితాన్ని నాశనం చేశారంటూ మహిళ ఆందోళన చేపట్టింది. అత్తింటివారి వేధింపుల నుండి కాపాడి తనకు న్యాయం జరిగేలా చూడాలంటూ పుట్టింటివారితో కలిసి ఆమె నిరాహార దీక్ష చేపట్టడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

తన పెళ్లి అయినప్పటి నుంచి తాను భర్తతో శరీరకంగా కలవలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ప్రతిరోజూ రాత్రిపూట తన భర్త దగ్గరకు రాకపోవడంతో అనుమానం వచ్చి అత్తామామలకు ఈ విషయం తెలిపానని బాధితురాలు చెప్పింది. ఈ విషయాన్ని వాళ్లు చాలా ఈజీగా తీసుకున్నారని.. దీన్ని బట్టి వారికి తమ కొడుకు సంసారానికి పనికిరాడని ముందుగానే తెలుసని అర్థమయ్యిందని వాపోయింది. తమ కుటుంబం పరువు పోతుందని.. అందుకే ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారని బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. అయితే తన జీవితం నాశనం చేసే హక్కు వాళ్లకు లేదని.. ఈ మేరకు తన భర్తతో విడాకులు కావాలని అత్తమామలను అడగ్గా.. వాళ్లు గ్రామ పంచాయతీ పెద్దల సమక్షంలో రూ.15 లక్షలు నష్టపరిహారంగా ఇస్తామని హామీ ఇచ్చారని.. కానీ ఇప్పుడు ఆ డబ్బు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్లు బాధితురాలు వివరించింది. గతంలో ఒప్పుకున్న డబ్బులు ఇచ్చేంత వరకు తన ఆందోళన విరమించేది లేదని పేర్కొంది.