NTV Telugu Site icon

Extramarital Affair: వివాహేతర సంబంధం.. సినిమాని మించిన త్రిల్లర్ క్రైమ్ స్టోరీ

Extramarital Affair1

Extramarital Affair1

Woman Killed Her Husband For Extramarital Affair: వివాహేతర సంబంధం కోసం ఒక మహిళ అత్యంత కిరాతకానికి పాల్పడింది. తన ప్రియుడితో కలిసుందామనుకొని, అడ్డుగా ఉన్న భర్తను దారుణంగా హతమార్చింది. ఆపై తన భర్త మరో మహిళతో పారిపోయాడని కట్టుకథ అల్లింది. కేసుని తప్పుదోవ పట్టించేందుకు సాయశక్తులా ప్రయత్నించింది. చివరికి.. పోలీసులకు అడ్డంగా బుక్కైంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నంలోని వలందపేటలో పోలమ్మ అనే మహిళ తన ఐదురు కుమారులు, ఒక కుమార్తెతో కలిసి ఉంటోంది. పోలమ్మకు రెండస్తుల ఇల్లు ఉంది. తన మూడో కుమారుడైన పైడిరాజుకి జ్యోతి అనే మహిళతో పెళ్లి చేసింది. వీళ్లు ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.

Actor Vijayakumar: ఆత్మహత్యాయత్నం కేసులో నిర్ధోషిగా మలయాళ నటుడు విజయకుమార్

కట్ చేస్తే.. జ్యోతికి విశాఖ అప్పుఘర్‌ ప్రాంతానికి చెందిన శ్రీనివాసరావుతో వివాహేతర సంబంధం ఉంది. తనకు ఎంవీపీ కాలనీలోని సీబీఐ కార్యాలయంలో ఉద్యోగం వచ్చిందని నమ్మించి, అక్కడ అద్దె ఇల్లు తీసుకొని, నూకరాజుతో రాసలీలలు కొనసాగించింది. ప్రియుడి మోజులో మునిగిన జ్యోతి.. అతనితో కలిసి బతకాలని నిర్ణయించుకుంది. అందుకు అడ్డుగా ఉన్న తన భర్తని హతమార్చాలని నిర్ణయించింది. ప్లాన్ ప్రకారం.. డిసెంబర్ 29న రాత్రి ఆహారంలో మత్తు పదార్థాలు కలిపి పైడిరాజుకి పెట్టింది. అది తిన్న తర్వాత స్పృహ తప్పిన పైడిరాజు తలపై బలమైన ఆయుధంతో దాడి చేయడంతో, అతడు మరణించాడు. ఆ మృతదేహాన్ని డిసెంబర్ 30న ప్రియుడు శ్రీనివాసరావు, అతని కజిన్ భూలోక సాయంతో శ్మశానవాటికలో దహనం చేసింది. అదే రోజు రాత్రి తన భర్త ఇంటి నుంచి అదృశ్యమయ్యాడని జ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో మహిళతో తన భర్త వెళ్లిపోయాడని నమ్మించేందుకు ప్రయత్నించింది. ఇందులో భాగంగానే.. దివ్య అనే మహిళతో కుటుంబ సభ్యులకు ఫోన్ చేయించి, తన కోసం వెతకొద్దని చెప్పించింది కూడా!

Babar Azam: బాబర్ ఆజంపై కొరడా.. కెప్టెన్సీ నుంచి తొలగింపు?

పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా.. పోలీసులకు జ్యోతిపై అనుమానం వచ్చింది. కేవలం 8వ తరగతి చదువుకున్న ఆమెకి, సీబీఐ ఆఫీస్‌లో ఉద్యోగం ఎలా వచ్చిందనే సందేహం కలిగింది. వాళ్లు కార్యాలయానికి వెళ్లి విచారించగా, జ్యోతి తమ వద్ద పని చేయట్లేదని చెప్పారు. దీంతో.. జ్యోతిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో ప్రశ్నించారు. తనకు శ్రీనివాసరావుతో వివాహేతర సంబంధం ఉందని, అతనితో కలిసి జీవించడం కోసమే తాను తన భర్తను హతమార్చానని జ్యోతి నేరం ఒప్పుకుంది. పైడిరాజు హత్యకు కారణమైన వీరిని కఠినంగా శిక్షించాలని అతని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.