Site icon NTV Telugu

Andhra Pradesh: కిరణ్ రాయల్పై ఆరోపణల కేసులో ట్విస్ట్.. లక్ష్మీరెడ్డిని అరెస్ట్!

Kiran Royal

Kiran Royal

Andhra Pradesh: జనసేన నేత కిరణ్ రాయల్ పై సంచలన ఆరోపణలు చేసిన లక్ష్మీ రెడ్డిని జైపూర్ పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ దగ్గర ఆమెను అదుపులోకి తీసుకొని యూనివర్సిటీ పోలీసు స్టేషన్ కి తరలించారు. 2021లో జైపూర్, చాంద్వాజీ పోలీసు స్టేషన్ లో లక్ష్మీ రెడ్డితో పాటు అరుణ్ రెడ్డి, మహమ్మద్ జాహిద్ ఖాన్ అలియాస్ ఘని అనే ముగ్గురిపై చీటింగ్ కేసు నమోదు అయింది. 419, 420, 66C, 66D, 120-B, 406 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Read Also: Smartphone: రూ.10 వేల బడ్జెట్‌లో Redmi 14C 5G Vs Realme C63 5Gలో ఏ ఫోన్ బెటర్?

అయితే, గతంలోనే అరుణ్ రెడ్డి, మహమ్మద్ జాహిద్ ఖాన్ అలియాస్ ఘని అనే ఇద్దరిని జైపూర్ పోలీసులు అరెస్టు చేయగా.. పరారీలో ఉన్న లక్ష్మీ రెడ్డి గత మూడు రోజులుగా కిరణ్ రాయల్ వ్యవహారంలో మీడియాలో కనిపించడంతో జైపూర్ నుంచి తిరుపతికి వచ్చిన పోలీసులు.. యూనివర్సిటీ పోలీసు స్టేషన్ లో హాజరు పరిచి.. తిరిగి జైపూర్ కి తీసుకుని వెళ్లి అవకాశం ఉంది.

Exit mobile version