Site icon NTV Telugu

WhatsApp for GGH : అత్యవసర రోగుల కోసం వాట్సప్‌ గ్రూప్‌..

108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి చేరుకునే రోగులకు తక్షణ చికిత్స అందించడానికి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) సిబ్బంది కోసం ఒక వాట్సాప్ గ్రూప్ సృష్టించబడిందని సూపరింటెండెంట్ వై కిరణ్ కుమార్ తెలిపారు. ప్రతి రోజు సగటున 1,500 నుండి 2,000 మంది జీజీహెచ్‌ను సందర్శిస్తున్నారని కిరణ్ కుమార్ తెలిపారు. వీరిలో 60 నుంచి 80 మందిని 108 అంబులెన్స్ సర్వీస్ ద్వారా ఆస్పత్రికి చేరుతున్నారన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లే ముందు, 108 అంబులెన్స్ సిబ్బంది సంబంధిత వ్యక్తి ఫోటోతో పాటు అతని/ఆమె పేరు మరియు వారి ఆరోగ్య పరిస్థితి వివరాలతో సహా కీలకమైన వివరాలతో పాటు వాట్సాప్‌లో సంబంధిత వైద్యులతో పంచుకుంటారు.

దీంతో వారు ఆసుపత్రి చేరేలోపే అవసరమయ్యే పరికరాలను కూడా వైద్యులు అందుబాటులో ఉంచుకునేందుకు వీలుగా ఉంటుందని ఆయన వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. కొన్ని కొన్ని సందర్భాల్లో వ్యక్తి ఆరోగ్య పరిస్థితి అనుగుణంగా అవసరమయ్యే చికిత్సను సూచించడానికి ఈ వాట్సప్‌ గ్రూప్‌ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

Exit mobile version