NTV Telugu Site icon

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

1. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,090లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 66,600లుగా ఉంది.

2. నేడు ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ఘాట్‌లో జూ.ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌లు నివాళులర్పించారు. అంతేకాకుండా లక్ష్మీపార్వతి కూడా ఎన్టీఆర్‌ ఘాట్‌లో నివాళులు అర్పించారు.

3. నేడు తాడేపల్లిగూడెంలో మూడో రోజు బస్సు యాత్ర జరుగనుంది. నారాయణపురం ఏలూరు బైపాస్‌, హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా యాత్ర సాగనుంది. గన్నవరం, విజయవాడ, మంగళగిరి మీదుగా బస్సుయాత్ర కొనసాగుతుంది.

4. ప్రకాశం జిల్లా ఒంగోలులో నేడు రెండవ రోజు టీడీపీ మహానాడు కార్యక్రమం జరుగనుంది.

5. నేడు ఎన్టీఆర్‌ శత జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు బైకు ర్యాలీ నిర్వహించనున్నారు. ఎన్నెస్పీ అతిథి గృహం నుంచి అద్దంకి సెంటర్‌ వరకు బైక్ ర్యాలీ కొనసాగనుంది.

6. నేడు తెనాలిలో నందమూరి బాలకృష్ణ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలను ప్రారంభించనున్నారు.