NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  1. నేడు ఏపీలో జగనన్న తోడు పథకం కింద వడ్డీలేని రుణాలు పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సీఎం జగన్‌ లబ్దిదారుల ఖాతాల్లో రుణాలను జమచేయనున్నారు.
  2. నేడు చెన్నైలో రాహుల్‌గాంధీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో స్టాలిన్‌ పుస్తకాన్ని రాహుల్‌గాంధీ అవిష్కరించనున్నారు. అంతేకాకుండా శరద్‌పవార్‌, స్టాలిన్‌లతో రాహుల్‌గాంధీ భేటీ కానున్నారు.
  3. నేడు తొలివిడత మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 5 రెండవ విడత ఎన్నికలు జరుగనున్నాయి. రెండు విడతల్లో 60 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే నేడు తొలివిడతలో 38 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
  4. హైదరాబాద్‌లో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,340 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,560లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 69,000లుగా ఉంది.
  5. నేడు యూఎన్‌ జనరల్ అసెంబ్లీ సమావేశం నిర్వహించనున్నారు. రష్యా దాడులపై జనరల్‌ అసెంబ్లీలో అత్యవసర చర్చ నిర్వహించనున్నారు. 11 దేశాల ఓటింగ్‌తో అత్యవసర చర్చకు ఆమోదించారు. ఓటింగ్‌కు భారత్‌, చైనా, యూఏఈ దూరంగా ఉండనున్నాయి.