నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఏప్రిల్, మే జూన్ నెలలకు సంబంధించిన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, నిజపాద దర్శనం టికెట్లను లక్కీ డిప్ విధానంలో విడుదల చేయనున్నారు.
నేటి నుంచి మళ్లీ జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగనుంది. ఈ నెల 27 వరకు జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుందని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
నేడు ఎంబీ భవన్‌కు మల్లు స్వరాజ్యం భౌతికకాయం. ఉదయం 9 గంటల వరకు సీపీఎం కార్యాలయంలో మల్లు స్వరాజ్యం భౌతికకాయం ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు.
నేడు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ల కీలక సమావేశం జరుగనుంది. 22న ఢిల్లీకి వెళ్లే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉన్నారు. మీటింగ్‌కు ఎవరెవరు హాజరవుతారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.