Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

1. ఏపీలో మంత్రివర్గ విస్తరణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు కొత్త మంత్రులకు సీఎం జగన్‌ తేనీటి విందు ఇవ్వనున్నారు.

2. ఏపీలో నేడు మరో సంచలన ప్రకటన చేసే అవకాశం ఉంది. కొత్త మంత్రుల ప్రకటనతో పాటే పార్టీపరంగా రీజనల్‌ కమిటీల ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. పాత మంత్రులకు రీజనల్‌ కమిటీ బాధ్యతలు అప్పగించనున్నారు. సీఎం జగన్‌తో సజ్జల భేటీలోనూ చర్చించినట్టు సమాచారం.

3. పాక్‌లో ఇమ్రాన్‌ఖాన్‌ సర్కార్‌ కుప్పకూలింది. విశ్వాస తీర్మానంలో ఇమ్రాన్‌ ఖాన్‌ ఓడిపోయారు. పాక్‌ జాతీయ అసెంబ్లీ అర్థరాత్రి ఓటింగ్‌ నిర్వహించింది. రేపు పాక్‌ కొత్త ప్రధానిగా షెహబాజ్‌ షరీఫ్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

4. నేడు భద్రాద్రిలో శ్రీసీతారామచంద్రస్వామి వారి కల్యాణం వైభవోపేతంగా జరుగనుంది. ఇప్పటికే కల్యాణోత్సవానికి భద్రాద్రి అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు రాములోరి కల్యాణం జరుగనుంది.

5. శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని శోభయాత్ర నిర్వహించనున్నారు. అంతేకాకుండా పండుగ సందర్భంగా ఉదయం 11 గంటల నుంచి మంగళ్‌హాట్‌ శోభాయాత్ర ప్రారంభం కానుంది. అయితే రాత్రి 10 గంటల వరకు పలు మార్గాల్లో ట్రాఫిక్‌ మళ్లించనున్నారు.

 

Exit mobile version