* నేడు మేడారంలో మంత్రులు పొంగులేటి, సీతక్క పర్యటన.. అభివృద్ధి పనుల పరిశీలన, జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష.. ఉదయం 10 గంటలకు మేడారం చేరుకోనున్న మంత్రులు సీతక్క, పొంగులేటి..
* నేడు గద్వాల, వనపర్తి జిల్లాల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన.. జోగులాంబ దేవిని దర్శించుకోనున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ..
* నేడు గ్రూప్-1 అప్పీల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ.. గ్రూప్-1 పరీక్షలు టీజీపీఎస్సీ సక్రమంగా నిర్వహించిందని వాదనల్లో పేర్కొన్న ఏజీ.. గ్రూప్-1పై సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించిన టీజీపీఎస్సీ..
* నేడు అసెంబ్లీలో కౌన్సిల్ ప్రివిలేజ్ కమిటీ సమావేశం.. బీజీ నాయుడు అధ్యక్షతన కౌన్సిల్ ప్రివిలేజ్ కమిటీ భేటీ.. సమావేశంలో 29 పెండింగ్ కేసులకు సంబంధించి చర్చ..
* నేటి నుంచి మూడు రోజుల పాటు పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన.. ఇవాళ సాయంత్రం పులివెందుల క్యాంప్ ఆఫీసులో ప్రజాదర్బార్.. రేపు ఉదయం ఇడుపులపాయలో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలకు హాజరు.. సాయంత్రం భాకరాపురం క్యాంప్ ఆఫీసులో ప్రజాదర్బార్.. 25వ తేదీన ఉదయం సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకలకు హాజరుకానున్న జగన్..
* నేడు తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. ఈ సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాదపద్మారాధన సేవ రద్దు..
* నేడు ఆన్ లైన్ లో మార్చి నెల దర్శన టికెట్లు విడుదల.. ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి అంగప్రదక్షిణ టోకెన్లు విడుదల.. ఉదయం 11 గంటలకి శ్రీవాణి దర్శన టికెట్లు రిలీజ్.. మధ్యాహ్నం 3 గంటలకి వయో వధృులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల..
* నేడు శ్రీలంకో భారత్ ఉమెన్స్ రెండో టీ20.. విశాఖ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్..
