NTV Telugu Site icon

Whats Today: ఈరోజు ఏమున్నాయంటే?

Whats Today New

Whats Today New

1. విజయవాడ:బెజవాడ సీపీ, సర్కిల్ ఇన్స్ పెక్టర్ గుణరామ్ కి డిప్యూటీ సీఎం పవన్ ఫోన్. జంగారెడ్డి గూడెం కి చెందిన విద్యార్దిని అదృశ్యం కేసు విచారణ గురించి ఫోన్ చేసిన పవన్. 8 నెలల క్రితం నుంచి అదృశ్యమైన విద్యార్దిని. బెజవాడ సిటీలో హోటల్ మేనేజ్ మెంట్ చేస్తున్న విద్యార్దిని.ఇప్పటి వరకు జరిగిన విచారణ అంశాలను పవన్ కి వివరించిన సీపీ రామకృష్ణ. స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తామని పవన్ కు తెలిపిన సీపీ.

2. అమరావతి: నేడు తెల్లవారు జామున విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి కాలినడకన బయలుదేరిన రాజధాని రైతులు. తుళ్లూరు నుండి పొంగళ్ళు నెత్తిన పెట్టుకొని విజయవాడ అమ్మవారి గుడికి రానున్న అమరావతి మహిళా రైతులు,రైతులు, రైతు కూలీలు. ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో అమరావతి నిర్మాణం సాకారం అవుతుండడంతో తమ మొక్కులను చెల్లించుకోనున్న రాజధాని గ్రామాల రైతులు.

3. అమరావతి: జిల్లాల ప్రక్షాళనను చేపట్టిన ఏపీ సర్కార్. భారీ ఎత్తున జిల్లా కలెక్టర్ల బదిలీలు. 26 జిల్లాలకు గానూ 13 జిల్లాల కలెక్టర్ల బదిలీ. జీఏడీకి ఆరు జిల్లాల కలెక్టర్లు. గత ప్రభుత్వంలో విపరీతమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కలెక్టర్లను జీఏడీకి పంపిన చంద్రబాబు సర్కార్.

4. నంద్యాల: నల్లమలలో చిరుతల కలకలం. నంద్యాల, గిద్దలూరు ఘాట్ రోడ్డులోని పచర్ల వద్ద చిరుత సంచారం. నిద్రపోతున్న దినసరి కూలీ షేక్. బీబీపై దాడి…తలకు గాయాలు.. స్థానికులు కర్రలతో తరమడంతో చిరుత పరారైంది.
గత నెల టోల్ గేట్ వద్ద వాచ్ మెన్ భాషపై దాడికి పాల్పడిన చిరుత. చిరుతను పట్టుకోవడానికి రెండు బోన్లను ఏర్పాటు చేయనున్న అటవీ అధికారులు.

5. నంద్యాల: మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నిసా పై అట్రాసిటీ కేసు నమోదు చేసిన త్రీ టౌన్ పోలీసులు. 29 వ వార్డు సచివాలయంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోల విషయంలో టిడిపి నేతలు,మాబున్నిసా మధ్య ఘర్షణ. తనను కులం పేరిట చైర్ పర్సన్ మాబున్నిసా దూషించారని ఫిర్యాదు చేసిన టిడిపి నేత తిమ్మయ్య. తిమ్మయ్య ఫిర్యాదు మేరకు చైర్పర్సన్ తో పాటు ఆమె భర్త జీలాని ,మరో ఇద్దరిపై అట్రాసిటి కేసు.

6. ప్రకాశం: సింగరాయకొండ వరాహ లక్ష్మనరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలలో పాల్గొననున్న
మంత్రి బాల వీరాంజనేయ స్వామి.. ఒంగోలు లోని పాత జెడ్పీ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన స్థాయి సంఘ సమావేశం.. ఒంగోలులో ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుంచి మినీ స్టేడియం వరకు ఒలింపిక్ రన్ కార్యక్రమంలో పాల్గొననున్న కలెక్టర్ దినేష్ కుమార్, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్.. ఒంగోలు రంగా భవన్ లో జనచైతన్య వేదిక మీడియా సమావేశం..

7. నెల్లూరు: మాజీ ఎం.పి.ఆదాల ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ ముఖ్య నాయకుల సమావేశం. దుత్తలూరు మండలం నరవాడలో నేటి నుంచి శ్రీ వెంగమాంబ బ్రహ్మోత్సవాలు.

8. తిరుమల: రేపు ఆన్ లైన్ లో సెప్టంబర్ నెలకు సంభందించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కేట్లను విడుదల చెయ్యనున్న టీటీడీ. మధ్యహ్నం వసతి గదులు కోటాను విడుదల చెయ్యనున్న టీటీడీ.

9. తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లలన్ని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్న భక్తులు. టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 24 గంటల సమయం. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 74467 మంది భక్తులు. తలనీలాలు సమర్పించిన 40005 మంది భక్తులు.హుండి ఆదాయం 3.77 కోట్లు..

10. అనంతపురం: ఆత్మకూరు మండలం పంపనూరులోని సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో రాహుకేతు హోమాలు.

11. శ్రీ సత్యసాయి: పెనుకొండ కు రానున్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా పెనుకొండ కి రానున్న మంత్రి. ఆంధ్ర సరిహద్దు కొడికొండ వద్ద నుంచి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసిన కార్యకర్తలు.

12. అనంతపురం: అక్రమ కట్టడమంటూ అనంతపురం వైయస్సార్ పార్టీ ఆఫీసుకు నోటీసులు జారీ. అక్రమ కట్టడాన్ని ఎందుకు కూల్చి వేయరాదో వివరణ ఇవ్వాలి. డిప్యూటీ సిటీ ప్లానర్ హరి ప్రసాద్ పేరిట వ్తెఎస్సాఆర్సీపీ జిల్లా అధ్యక్షునికి నోటీసులు జారీ.

13. కడప: పులివెందులలోని వైసీపీ కార్యాలయంలో కార్యకర్తలు నేతలతో సమావేశం కానున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

14. విశాఖ: విజయవాడ మార్గంలో రైలు ప్రయాణీకులకు తప్పని తిప్పలు. నేటి నుంచి ఆగస్టు 10 వరకు పలు కీలకమైన రైళ్లు రద్దు. రత్నాచల్, హాద్రి,జన్మభూమి, రాయగడ్ ఎక్స్ ప్రెస్ సహా పలు రైళ్లు రాకపోకలు బంద్. కడియం – నిడదవోలు మధ్య ఆధుని కీకరణ పనులు కారణంగా రద్దు చేసిన వాల్తేర్ అధికారులు.

15. చిత్తూరు: కుప్పంలో మహిళపై కత్తితో దాడి. ఆర్థిక లావాదేవీల విషయమై మహిళపై యువకుడు కత్తితో దాడి. కుప్పం మండలం యనమనాశనపల్లిక శివకుమార్ లక్ష్మిపై మహిళపై కత్తితో దాడి. ఆస్పత్రికి తరలించారు.

16. జయశంకర్ భూపాలపల్లి: మహాదేవపూర్ సీఐ రాజేశ్వర్ రావు పై బదిలీ వేటు. సర్కిల్ పరిధిలోని కాళేశ్వరం, మహాదేవపూర్ పోలీస్ స్టేషన్ లో జరిగిన వరుస ఘటనలపై ఐజీ కార్యాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన మల్టీ జోన్ ఐజీ రంగనాథ్.

17. ఆదిలాబాద్: పలు మండలాల్లో వర్షం. జిల్లా కేంద్రంలో ఉదయం నుంచి కురుస్తున్న ఓ మోస్తారు వాన. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆది, సోమ వారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక శనివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో 13.1 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది.

18. నీట్: నేడు జరగాల్సిన నీట్ పరీక్ష వాయిదా.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే వాయిదా.. కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్న వైద్యారోగ్యశాఖ

19. హైదరాబాద్: పాతబస్తీలో అర్థరాత్రి పోలీసుల తనిఖీలు.. చార్మినార్, యాకత్ పురా, గులజార్ హౌస్లో సెర్చింగ్..
Thandel : వాస్తవ ఘటనల ఆధారంగా నాగచైతన్య ‘తండేల్’..