* నేడు మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లిలో ఐఐటీకి శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్.. జిల్లాలోని మున్సిపాలిటీలకు సంబంధించిన పలు అభివృద్ధి పనులకూ శంకుస్థాపనలు..
* నేడు దావోస్ కు వెళ్లనున్న మంత్రి శ్రీధర్ బాబు.. మంత్రి వెంట వెళ్లనున్న స్పెషల్ సీఎస్ సంజయ్ కుమార్..
* నేడు ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన..
* నేడు ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన..
* నేడు మున్సిపల్ వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు.. రాజకీయ పార్టీల సమక్షంలో రిజర్వేషన్లు ఖరారు.. ఇప్పటికే మున్సిపల్, కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ఖరారు చేసిన మున్సిపల్ శాఖ..
* నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్ భేటీ.. సీనియర్ నేతలతో కేటీఆర్ బ్రేక్ ఫాస్ట్ సమావేశం.. అనంతరం ఉదయం 10 గంటలకి భారీ ర్యాలీ.. సికింద్రాబాద్ ను కార్పొరేషన్ చేయాలని డిమాండ్..
* నేడు పరేడ్ గ్రౌండ్ లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్.. రెండోరోజు జరగనున్న ఎయిర్ బెలూన్ ఫెస్టివల్.. ఆన్ లైన్ లో హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ టికెట్ల అమ్మకం..
* నేడు గచ్చిబౌలి స్టేడియంలో రెండో రోజు డ్రోన్ ఫెస్టివల్..
* నేడు మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ సన్నాహక సమావేశం.. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు అధ్యక్షతన భేటీ.. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్ధశం.. ఎన్నికల పర్యవేక్షణ కోసం రాష్ట్రస్థాయిలో కమిటీ ఏర్పాటు.. ప్రతి మున్సిపాలిటీకి ఎన్నికల ఇంఛార్జ్ గా రాష్ట్రస్థాయి నేత..
* నేడు సంగారెడ్డి గంజి మైదాన్ లో ఇండ్లు లేని పేదలతో మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మీటింగ్.. గతంలో ఇళ్ల పట్టాలు అందుకున్న వారు మీటింగ్ కి రావాలని జగ్గారెడ్డి పిలుపు..
* నేడు కాకినాడలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన.. రూ. 13 వేల కోట్లతో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ కు శంకుస్థాపన.. 495 ఎకరాల్లో నిర్మాణం, ఏడాదికి మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి.. కార్బన్ ఉద్గారాలు లేకుండా హైడ్రోజన్ తో గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి..
* నేడు నెల్లూరు పెన్నా నదిలో ఏటి పండుగ.. ఏటి పండుగలో పాల్గొననున్న మంత్రి నారాయణ..
* నేడు దళిత సంఘాలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వైసీపీ నిరసనలు.. వైసీపీ కార్యకర్త మందా సాల్మన్ హత్యకు నిరసనగా పార్టీ ఎస్సీ సెల్, దళిత సంఘాలతో కలిసి జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు.. జిల్లా కేంద్రాల్లోని బీఆర్ అంబేడ్కర్ విగ్రహాల వద్ద ఉదయం 10 గంటలకు నిరసనలకు పిలుపునిచ్చిన వైసీపీ..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయి వెలుపల క్యూ లైనులో వేచి ఉన్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 20 గంటల సమయం..
* నేడు బెంగాల్ పర్యటనకు ప్రధాని మోడీ.. బెంగాల్ లో రూ.3,250 కోట్ల రూపాయలకు పైగా విలువైన రైలు–రోడ్డు ప్రాజెక్టులకు ప్రారంభం, శంకుస్థాపనలు చేయనున్న ప్రధాని.. హౌరా–గువాహటి (కామాఖ్య) మధ్య దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ..
* నేడు ఇండోర్ లో రాహుల్ గాంధీ పర్యటన.. డయేరియాతో మరణించిన చిన్నారుల కుటుంబాలను పరామర్శించనున్న రాహుల్.. ఇండోర్ లో నీటితో కాలుష్యంతో తలెత్తిన సమస్యలపై రాహుల్ ఫోకస్..
* నేడు తమిళనాడులోని అలాంగనల్లూర్ లో జల్లికట్టు పోటీలు.. పోటీల్లో వెయ్యికి పైగా ఎద్దులు, 600 మంది యువకులు.. పోటీల్లో నిలిచిన వారికి కార్ల బహుమతులు.. పోటీల దగ్గర వైద్య శిబిరాలు ఏర్పాటు..
* నేడు అండర్-19 వరల్డ్ కప్ లో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్.. మధ్యాహ్నం ఒంటి గంటకు మ్యాచ్ ప్రారంభం..
* నేడు డబ్ల్యూపీఎల్ లో మధ్యాహ్నం 3 గంటలకి యూపీ వర్సెస్ ముంబై.. రాత్రి 7: 30కి ఢిల్లీతో తలపడనున్న ఆర్సీబీ..
