* నేడు రెండో రోజు కలెక్టర్ల సమావేశం.. ఐటీ, రెవెన్యూ శాఖలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక సమీక్ష.. సాయంత్రం శాంతి భద్రతలపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం సమీక్ష.. లా అండ్ ఆర్డర్ పై కొత్త ఎస్పీలకు సూచనలు ఇవ్వనున్న సీఎం చంద్రబాబు..
* నేటి నుంచి మంత్రి లోకేష్ లండన్ పర్యటన.. నవంబర్ 14, 15 తేదీల్లో వైజాగ్ లో జరిగే పార్ట్ నర్ షిఫ్ సమ్మిట్ కు సంబంధించిన.. అధ్యయనానికి నారా లోకేష్, ఇండస్ట్రీస్ డైరెక్టర్ లండన్ పర్యటన.. ఎడ్యుకేషన్, హెల్త్, ఫార్మా రంగాలపై అధ్యయనం..
* నేడు బెంగళూరు నుంచి తాడేపల్లికి మాజీ సీఎం వైఎస్ జగన్.. ఉదయం 11.55కి గన్నవరం చేరుకోనున్న జగన్.. మధ్యాహ్నం 12.10కి తాడేపల్లి నివాసానికి వెళ్ళనున్న జగన్.. అందుబాటులో ఉన్న ముఖ్యనేతలతో సమావేశం కానున్న జగన్.. తాజా రాజకీయ అంశాలపై చర్చించే అవకాశం..
* నేడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ.. లిక్కర్ స్కాం కేసులో ఏ4గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి..
* నేడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఎంపీ మిథున్ రెడ్డితో ములాఖాత్ కానున్న వైసీపీ నేతలు.. మిథున్ రెడ్డితో ములాఖాత్ కానున్న కాకాణి, గొల్లిపల్లి, కాటసారి రాంభూపాల్ రెడ్డి..
* నేడు మ ధ్యాహ్నం టీటీడీ పాలకమండలి సమావేశం.. శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చ.. ఆలయ నిర్మాణాలకు నిధులు కేటాయింపుపై నిర్ణయం తీసుకోనున్న పాలకమండలి..
* నేడు తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. సుప్రభాతం, తోమాల, అర్చన సేవలు ఏకాంతం.. ఈ సందర్భంగా అష్టదళపాదపద్మారాధన సేవలు రద్దు.. మధ్యాహ్నం ప్రారంభంగానున్న సర్వదర్శనం..
* నేడు ఉదయం 9.45 గంటలకు MGBS మెట్రో స్టేషన్‌లో ఏర్పాటు చేసిన పాస్ పోర్టు సేవా కేంద్రాన్ని ప్రారంభించనున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. అనంతరం ఉదయం 11 గంటలకు MGBS నుంచి రాయదుర్గ్ వరకు మెట్రో రైల్లో ప్రయాణం..
* నేడు మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి..
* నేటి నుంచి తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత.. రూ. 1400 కోట్ల బకాయిలు ఉన్నట్లు చెబుతున్న ఆస్పత్రుల యాజమాన్యాలు.. గత 20 రోజులుగా ప్రభుత్వంలో జరిపిన చర్చలు విఫలం.. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 330 ఆస్పత్రులు, గత 12 నెలలుగా పెండింగ్ లో ఉన్న బకాయిలు..
* నేటి నుంచి యథావిధిగా తెరుచుకోనున్న కాలేజీలు.. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు సఫలం.. బంద్ ను విరమించుకున్న ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు.. రూ. 600 కోట్లు ఇచ్చేందుకు ఒప్పుకున్న సర్కార్..
* నేడు దోహాలో 60 అరబ్- ఇస్లామిక్ దేశాల సమ్మిట్..
* నేడు ట్రేడ్ డీల్ పై ఢిల్లీలో అమెరికన్ బృందం చర్చలు..
* నేడు మాడ్రిడ్ లో అమెరికా- చైనా 4వ రౌండ్ ట్రేడ్ చర్చలు..
* నేడు ఆసియా కప్ లో బంగ్లాదేశ్ తో తలపడబోతున్న అఫ్ఘనిస్తాన్.. అబుదాబి వేదికగా రాత్రి 8 గంటలకి మ్యాచ్..
