* నేడు తిరుమల శ్రీవారి ఆలయంలో పార్వేట ఉత్సవం.. ఈ సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ..
* నేడు కోనసీమలోని జగ్గన్నతోట ప్రభల తీర్థం.. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రభల తీర్థం.. జగ్గన్న తోట ప్రభల ఉత్సవానికి రాష్ట్ర పండుగ హోదాను కల్పించిన ఏపీ ప్రభుత్వం..
* నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. చనాక- కోరాట పంప్ హౌస్ ప్రారంభోత్సవంతో పాటు నిర్మల్ జిల్లాలో సదర్మాట్ బ్యారేజీ ఇనాగ్రేషన్ చేయనున్న సీఎం..
* నేడు ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన.. ఈనెల 18న రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లపై పరిశీలన.. ఎద్దులాపురం మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన..
* నేడు జిల్లాలో మంత్రి వివేక్ పర్యటన.. క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి వివేక్..
* నేడు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ.. విచారణ జరపనున్న జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ల ధర్మాసనం.. ఇప్పటికే ఏడుగురి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీర్పు.. ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పష్టం చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్..
* నేడు మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ పర్యటన.. మంగళగిరి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను తిలకించనున్న లోకేష్.. మంగళగిరిలో నూతనంగా నిర్మించిన పీర్ల పంజాను సందర్శించనున్న లోకేష్
* నేడు మహారాష్ట్రలోని 29 నగరపాలక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన.. 23 కేంద్రాల్లో ఉదయం 10 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం..
* నేడు అండర్-19 వరల్డ్ కప్ లో ఆసీస్ తో ఐర్లాండ్ ఢీ.. మధ్యాహ్నం ఒంటి గంటకు మ్యాచ్ ప్రారంభం..
