Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  1. ఏపీలో జిల్లాల పునర్విభజన పై సీఎం జగన్ కీలక సమీక్ష. ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టనున్న ముఖ్యమంత్రి జగన్. తుది మార్పులు చేర్పులతో సిద్ధం కానున్న ఫైనల్ డ్రాఫ్ట్
  2. సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లా పర్యటన. వేములవాడ ,కొండగట్టు దేవాలయాల సందర్శన. పలు అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశాల్లో పాల్గొననున్న కేసీఆర్
  3. మాసశివరాత్రి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించిన ఆలయ అర్చకులు. సాయంత్రం స్వామివారి కళ్యాణ మండపంలో మహాలింగార్చన.
  4. నేడు గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం చిరుమామిళ్ళలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పర్యటన. గ్రామానికి చెందిన నడికట్టు రామిరెడ్డి జీవితావలోకనం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్న డీజీపీ. మాజీ ఐఎఎస్ అజేయ కల్లం.
  5. శ్రీకాకుళంలో నేడు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు పర్యటన. రాజాం , పాలకొండ , శ్రీకాకుళం డిపోలను పరిశీలించనున్న ఎండీ.
  6. తిరుపతిలోని టీటీడీ అనుబంధ ఆలయమైన కోదండరాముని బ్రహ్మోత్సవాలకు వేడుకగా అంకురార్పణ.
  7. నేడు కాకినాడ జిల్లాప్రజాప‌రిష‌త్ స‌మావేశ హాల్‌లో స్థాయీ సంఘాల స‌మావేశం
  8. అనకాపల్లి నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర మహోత్సవం ప్రారంభం. నెలరోజుల పాటు ఉత్సవాలు
  9. నేటి నుండి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు. స్వామివారి యాగశాల ప్రవేశంతో ఉగాది మహోత్సవాలకు శ్రీకారం
Exit mobile version