Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whatstoday

Whatstoday

* నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. మార్కాపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమానికి హాజరు కానున్న చంద్రబాబు.. మధ్యాహ్నం మహిళలతో ముఖాముఖి.. సాయంత్రం పార్టీ కార్యకర్తలతో సమావేశం..

* నేడు ఇందిరా శక్తి మహిళా శక్తి బస్సులను ప్రారభించనున్న సీఎం రేవంత్ రెడ్డి.. తొలి దశలో 150 అద్దె బస్సులు కేటాయింపు..

* నేడు మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. రాత్రికి ఢిల్లీలో కాంగ్రెస్ నేతల కీలక సమావేశం.. రేవంత్ రెడ్డితో పాటు ఢిల్లీకి భట్టి, ఉత్తమ్, మహేశ్ గౌడ్.. ఏఐసీసీ పెద్దలతో ఎమ్మెల్సీ అభ్యర్థులపై చర్చలు..

* నేడు ప్రజాభవన్ లో అన్ని పార్టీల ఎంపీలతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమావేశం.. కేంద్రంలో పెండింగ్ సమస్యల సాధన అజెండాపై చర్చ.. ముఖ్య అతిథులుగా హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు ఆహ్వానం.. అన్ని పార్టీల ఎంపీలకు ఫోన్ చేసి ఆహ్వానించిన డిప్యూటీ సీఎం భట్టి..

* నేడు ప‌రేడ్ గ్రౌండ్ వేదిక‌గా సాయంత్రం 5 గంటలకు మంత్రి సీత‌క్క అధ్యక్షతన భారీ బ‌హిరంగ స‌భ‌.. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి.. హ‌జ‌రుకానున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఇత‌ర మంత్రులు.

* నేటి ఉదయం 9.30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ.. కేంద్ర ప్రభుత్వం వద్ద సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న రాష్ట్ర సమస్యలను విన్నవించనున్న మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, కొండా సురేఖ..

* నేడు SLBC టన్నెల్ దగ్గరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ పరిశీలించనున్న మంత్రి.. మృతుల కుటుంబాలకు పరిహారంపై కీలక ప్రకటన చేసే అవకాశం..

* నేడు కొనసాగుతున్న SLBC టన్నెల్ రెస్య్కూ ఆపరేషన్.. జీపీఆర్,, క్యాడవర్ డాగ్స్ తో మార్క్ చేసి మృతదేహాల కోసం తవ్వకాలు.. కొనసాగుతున్న డీ వాటరింగ్, టీబీఎం మిషిన్ కటింగ్ పనులు..

* నేడు తెలంగాణలో సునీల్ బన్సల్ పర్యటన.. తెలంగాణ బీజేపీ నేతలతో కీలక సమీక్షలు.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, స్థానిక సంస్థల ఎన్నికలు.. వాజ్ పేయి శతజయంతి వేడుకలపై సమీక్షించనున్న బన్సల్..

* నేడు రాజమండ్రిలో మహిళా దినోత్సవ వేడుకలు.. పాల్గొననున్న ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి..

* నేడు పోలీస్ కస్టడీకి పోసాని కృష్ణ మురళి.. విచారణ చేయనున్న పోలీసులు..

* నేడు రంగన్న మృతదేహానికి రీ పోస్టుమార్టం.. వివేక ఇంటి వాచ్ మెన్ రంగన్న మృతిపై పోలీసుల అనుమానం.. నలుగురు వైద్యులతో కూడిన బృందం పులివెందులకు రాక.. సిట్, రెవెన్యూ అధికారుల సమక్షంలో మరోసారి రీ పోస్టుమార్టం..

* నేడు గుజరాత్ లో ప్రధాని మోడీ పర్యటన.. నవ్ సారీ జిల్లాలో మహిళా దినోత్సవ వేడుకకు హాజరు.. కార్యక్రమానికి పూర్తిగా మహిళా పోలీసుల భద్రతా.. చరిత్రలో తొలిసారి పూర్తిగా మహిళా పోలీసులతో పహారా..

* డబ్ల్యూపీఎల్: నేడు బెంగళూరు వర్సెస్ యూపీ.. లక్నో వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్..

Exit mobile version