NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

1. నల్లగొండ పట్టణం పాతబస్తీ హనుమాన్ నగర్ శ్రీ అభయాంజనేయ స్వామి వారి ప్రతిష్ట మహోత్సవనికీ హాజరైన కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. స్వామి వారి పూజకార్యక్రమం లో పాల్గొనున్న కిషన్ రెడ్డి..

2. నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రి దామోదర రాజనర్సంహ పర్యటన. అందోల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి దామోదర.

3. నేడు సిద్దిపేట జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన. పుల్లురు బండ జాతరలో పాల్గొననున్న హరీష్ రావు.

4. జగిత్యాల జిల్లాల్లో రెండవ రోజు కొనసాగనున్న బండి సంజయ్ ప్రజాహిత యాత్ర..కథలాపూర్ మండలం సిరికొండ నుండి చందుర్తి మండలం నర్సింగపూర్ వరకు కొనసాగనున్న ప్రజాహిత యాత్ర..

Read also: Lord Surya Stotram: ఈ స్తోత్రాలు వింటే ఐశ్వర్యం కలిగేలా ఆదిత్యుడు ఆశీర్వదిస్తాడు

5. నేడు కాకినాడ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు.సాయంత్రం 5:30 కు కాకినాడలో బయలుదేరి మంగళవారం ఉదయం 10:30 కు అయోధ్య చేరుకోనున్న ట్రైన్. 1882 కిలోమీటర్ల ప్రయాణం. ఈనెల 14 న అయోధ్య నుంచి తిరిగి కాకినాడ రానున్న రైలు.

6. కాకినాడ-రత్నగిరిపై నేటి నుంచి పెళ్లిళ్ళ సందడి. ఏప్రిల్ 26 వరకు మాఘ మాసం వివాహా ముహూర్తాలు. 30 శుభ ముహూర్తాలు ఉన్నాయని తెలిపిన అర్చకులు.కొండపై ఇప్పటికే అడ్వాన్స్ రిజర్వేషన్లు.

7. ప్రకాశం : టంగుటూరు, సూరారెడ్డిపాలెంలలో నూతనంగా నిర్మించిన సచివాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఆదిమూలపు సురేష్..

8. బాపట్ల : వేటపాలెం మండలం కొత్తపేట ఓంకారేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అయోద్య రామ మందిర ప్రాణ ప్రతిష్టకు యంత్ర సమర్పించిన అన్నదానం చిదంబర శాస్త్రికి అభినందన సభ..

9. ఒంగోలులో పేదల ఇళ్ల స్థలాల పంపిణీకి మౌలిక సదుపాయాల కల్పన పనులను పరిశీలించనున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..

10. నేడు రాజమండ్రి రూరల్ వేమగిరి గ్రౌండ్ లో దళితుల సింహ గర్జన. ఎన్నికల తరుణంలో మాజీ ఎంపీ హర్ష కుమార్ ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ.రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిగా తరలిరానున్న దళిత సంఘాలు

11. నేడు రాష్ట్రమంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పర్యటన వివరాలు. కడియం మండలం మురమండ గ్రామంలో పర్యాటన. మురమండ కళ్యాణ మండపంలో చేనేత కార్మికులకు మగ్గాలు, రాట్నాలు పంపిణీ చేయనున్న మంత్రి వేణుగోపాలకృష్ణ

12. పశ్చిమగోదావరిజిల్లాలో మంత్రి కొట్టు సత్యనారాయణ పర్యటన.తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు..ఉదయం 11 గంటలకు చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గంలోని శ్రీ దేశమ్మ అమ్మ వారి టెంపుల్ ను సందర్శిస్తారు.. అనంతరం ఏపీ టూరిజం మినిస్టర్ రోజాతో కలిసి నగిరి లో జరిగే గంగమ్మ జాతరలో పాల్గొంటారు.

13. ఏలూరు జిల్లాలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పర్యటించనున్నారు. ఉదయం 9:00 గంటలకు కైకలూరు మండలం కొల్లేటికోట శ్రీ పెద్దింట్లమ్మ తల్లి ఆలయానికి వెళ్ళే వంతెన ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం ఏలూరులో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి కారుమూరి..

14. నేటి నుంచి ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు..150కేంద్రాల్లో 37,927మంది విద్యార్థులు హాజరు…సీసీ కెమెరాల పర్యవేక్షణలో కొనసాగనున్న ప్రాక్టి కాల్స్…

15. నేడు జగ్గయ్యపేట లో ఎంపి కేశినేని నాని పర్యటించనున్నారు. స్థానికంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న ఎంపి కేశినేని.

16. తిరుమతిలో రథ సప్తమి సందర్భంగా 15,16,17 వ తేదిలలో తిరుపతిలో జారి చేసే సర్వదర్శన టోకేన్లు రద్దు చేసిన టిటిడి.

17. నేడు కొండవీడు కోటలో రెండవ రోజు కొనసాగనున్న 2024 ఫెస్ట్ ఉత్సవాలు…. ఆదివారం కావడంతో భారీగా పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్న అధికారులు…
Money Laundering Case : హేమంత్ సోరెన్‌తో ధీరజ్ సాహుకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా?